హైదరాబాద్లో కూల్ వెదర్ : అక్కడక్కడ దంచి కొడుతున్న వర్షం

హైదరాబాద్లో కూల్ వెదర్ : అక్కడక్కడ దంచి కొడుతున్న వర్షం


హైదరాబాద్ సిటీ మొత్తం కూల్ వెదర్ ఉంది.. అర్థరాత్రి నుంచి చిరు జల్లులు పడుతున్నాయి. సిటీ మొత్తం ముసురు వాతావరణం నెలకొంది. ఈశాన్య రుతు పవనాల రాక, బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ తో సిటీ అంతా చల్లటి వాతావరణం నెలకొంది. అక్కడక్కడ.. అప్పుడప్పుడు భారీ వర్షం దంచి కొడుతుంది. ఓ చోట వర్షం.. మరో చోట చిరు జల్లలు.. మరో చోట కూల్ వెదర్.. ఇంకో చోట పొడి వాతావరణం.. ఇలా విభిన్నంగా ఉంది.

జూబ్లీహిల్స్, బంజారహిల్స్ లో  చిరుజల్లులు పడుతున్నాయి.లింగంపల్లి, కూకట్ పల్లిలో వర్షం దంచి కొడుతుంది.  బాల్ నగర్ ,  చింతల్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి.   పంజాగుట్ట, అమీర్ పేట్, యూసఫ్ గూడ, ఖైరతాబాద్, లక్డీకపూల్, నారాయణగూడలో మోస్తారు వర్షాలు పడుతున్నాయి.  అపుడే వర్షం పడి..మళ్లీ వెంటనే ఎండలు వస్తున్నాయి.  

Also Read:-ఏపీలో రెడ్ అలర్ట్

వర్షం పడిన చోట పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.  ఆఫీస్ కు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. 

అటు ఉమ్మడి మెదక్, సంగారెడ్డి జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. సిద్దిపేట, గజ్వేల్ , మెదక్ ,మనోహరబాద్ పరిసరాల్లో వర్షం పడుతోంది. మరో వైపు   తెలంగాణలో మరో ఐదురోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది.