50 వేల మ్యాన్ హోల్స్ శుభ్రం

హైదరాబాద్​సిటీ, వెలుగు: హైదరాబాద్​ను సీవేజ్​ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీగా మార్చేందుకు వాటర్​బోర్డు చేపట్టిన 90 రోజుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 50 వేల మ్యాన్ హోల్స్ శుభ్రం చేసినట్టు అధికారులు తెలిపారు. 6,140 ప్రాంతాల్లో 700 కిలో మీటర్ల మేర సీవరేజ్​పైప్​లైన్ డీ-సిల్టింగ్ పనులు నిర్వహించినట్టు తెలిపారు. అధికారులు, సిబ్బందిని ఎండీ అశోక్ రెడ్డి అభినందించారు. ఇదే స్ఫూర్తితో డ్రైవ్​ను సక్సెస్​చేయాలని సూచించారు.