హైదరాబాద్‌సిటీ, వెలుగు : సరైన క్లీనింగ్లేక 20 ఏండ్లుగా పూడికతో నిండిపోయిన డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించేందుకు వాటర్‌బోర్డు పనులు షురూ చేసింది. గ్రేటర్‌పరిధిలో చిన్న వాన పడితే చాలు అనేక ప్రాంతాల్లో, మెయిన్రోడ్లపైన డ్రైనేజీ ఓవర్‌ఫ్లో అయి కంపు కొడుతోంది. క్షేత్రస్థాయి సిబ్బంది డ్రైనేజీ పొంగినప్పుడు పైపైన క్లీన్‌చేసి వదిలేస్తున్నారు. ఏండ్లుగా పేరుకుపోయిన సిల్ట్(పూడిక)ను పట్టించుకోవడం లేదు. ఈ కారణంగా సమస్య మళ్లీ మళ్లీ పునరావృతమవుతోందని వాటర్‌బోర్డు గుర్తించింది. ఈ సమస్యకు చెక్‌పెట్టేందుకు ప్రస్తుతం నడుస్తున్న 90 రోజుల స్పెషల్‌డ్రైవ్‌లో ప్రతి మ్యాన్‌హోల్‌ను క్లీన్చేయాలని నిర్ణయించింది.
గ్రేటర్‌వ్యాప్తంగా చిన్నచిన్నవి మినహా 4 అడుగుల వెడల్పు, 20 అడుగుల లోతు మ్యాన్‌హోల్స్4 లక్షల వరకు, మెయిన్రోడ్లపై ట్రంక్మెయిన్లు(15 నుంచి 20 అడుగుల లోతు) 50 వేలకు పైగా ఉన్నాయి. వీటన్నింటినీ పూర్తిగా క్లీన్చేస్తే మరో పదేండ్ల వరకు డ్రైనేజీ ఓవర్‌ఫ్లో సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు.
25 స్పెషల్ టీమ్స్..
90 రోజుల్లో మూడున్నర లక్షల మ్యాన్హోల్స్క్లీన్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు వాటర్ బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు.రోజుకు 400 మ్యాన్ హోల్స్ క్లీనింగ్ చేయాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. ఇందుకోసం 25 స్పెషల్టీమ్స్ను ఏర్పాటు చేశామని, ఒక్కో టీమ్‌లో ఐదుగురు సిబ్బంది ఉంటారన్నారు. మ్యాన్హోల్స్క్లీనింగ్కోసం 200 ఎయిర్ టెక్ మెషీన్లు వినియోగిస్తున్నారు. పూడిక తీసిన తర్వాత వ్యర్థాలను తరలించడానికి మరో 140 సిల్ట్ క్యారియర్ వాహనాలను అందుబాటులో ఉంచారు. 20 ఏండ్లలో మహానగరంలో ఈ స్థాయిలో డీ సిల్టింగ్ పనులు చేపట్టడం ఇదే మొదటిసారి. వచ్చే వర్షాకాలం నాటికి గ్రేటర్‌ను సీవరేజ్ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీగా రూపొందించడమే లక్ష్యంగా అధికారులు ముందుకు
సాగుతున్నారు.
సుల్తాన్‌బజార్‌లో పర్యటించిన ఎండీ
సీవరేజీ డీసిల్టింగ్పనుల పర్యవేక్షణలో భాగంగా సోమవారం వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి సుల్తాన్ బజార్ లో పర్యటించారు. మ్యాన్ హోళ్ల నుంచి తీసిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు సిల్ట్ కార్టింగ్ వాహనాల ద్వారా తరలించాలని సూచించారు. వాణిజ్య సముదాయాలు, దవాఖానలు, వసతి గృహాలు తదితర యజమానులకు సిల్ట్ చాంబర్లు నిర్మించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆ సూచనలు పాటించని పక్షంలో వారికి నోటీసులు జారీ చేయాలన్నారు.