ప్రతినెలా వాటర్​ బోర్డుకు రూ.100 కోట్లు లాస్..

ప్రతినెలా వాటర్​ బోర్డుకు రూ.100 కోట్లు లాస్..
  • 14 లక్షల కనెక్షన్లలో మీటర్లున్నవి 5 లక్షలే
  • 550 ఎంజీడీలు సరఫరాకు వస్తున్న ఆదాయం 100 కోట్ల లోపే..
  • అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం
  • మీటర్ రీడర్లు గుర్తించాలని వాటర్​బోర్డు ఎండీ ఆదేశాలు 

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​పరిధిలో దాదాపు14 లక్షల వాటర్​కనెక్షన్లు ఉండగా, ఇందులో కేవలం ఐదు లక్షల కనెక్షన్లకే మీటర్లు ఉన్నట్టు తేలింది. వాటర్​బోర్డు రోజూ సిటీకి 550 ఎంజీడీల నీరు సరఫరా చేస్తుండగా, ఇందుకు తగ్గట్టు రెవెన్యూ రావడం లేదు. 13.80 లక్షల నల్లా కనెక్షన్లలో 5.11లక్షల కనెక్షన్లకు మాత్రమే మీటర్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

మొత్తం కనెక్షన్లలో 80 శాతం డొమెస్టిక్​కనెక్షన్లు(1/2అంగుళాలు) కాగా, మిగిలిన వాటిలో 10 శాతం మల్టీస్టోరీడ్(1/3, 1 అంగుళం), మరో 10 శాతం బల్క్, ఇండస్ట్రియల్​సప్లయ్​కనెక్షన్లు ఉన్నాయి. మీటర్లు లేని కనెక్షన్లలో 60 శాతం డొమెస్టిక్​కాగా, తర్వాత స్థానం మల్టీస్టోరీడ్​కనెక్షన్లేనని అధికారులు చెబుతున్నారు. ప్రతి నెలా మీటర్​రీడింగ్​తీసుకునే వ్యక్తులు మీటర్​లేని కనెక్షన్లకు యావరేజ్​బిల్లు వేస్తున్నారు. దీంతో 550 ఎంజీడీలకు నెలకు దాదాపు రూ.200 కోట్లు రావాల్సి ఉండగా, రూ.100 కోట్లకు మించడం లేదు.

అధికారుల ఉదాసీనత 

కొందరు అధికారులు నీటి మీటర్ల ఏర్పాటుపై ఊదాసీనత ప్రదర్శిండమే వాటర్​బోర్డుకు ప్రతి నెలా ఆదాయం తగ్గడానికి కారణంగా తెలుస్తున్నది. గతంలో బోర్డు రెవెన్యూ విభాగంలో పని చేసిన ఓ ఉన్నతాధికారి నిర్వాకం వల్లే బోర్డు పరిధిలో నల్లా కనెక్షన్ల వ్యవహారం అస్తవ్యస్తంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా నల్లా కనెక్షన్​తీసుకున్న వెంటనే వినియోగదారుడు తప్పనిసరిగా మీటర్ ఏర్పాటు చేసుకునేలా చూడాలి. కానీ, నల్లా కనెక్షన్​ఇవ్వడానికి ఏర్పాటు చేసిన సింగిల్​విండో సెల్.. కనెక్షన్లను ఇవ్వడం వరకే పరిమితమవుతోంది.

మీటర్​ బిగించుకున్నారా? లేదా? అన్నది చూడడం లేదు. అంతే కాకుండా ఆయా సెక్షన్ల అధికారులు కూడా ప్రతి కనెక్షన్​కు మీటర్ ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉన్నా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో బోర్డు ఆదాయంపై ప్రభావం చూపిస్తోంది. ఇక నుంచి నల్లా బిల్లులు జారీ చేసే టైంలో మీటర్​రీడర్లు ఉన్నదీ లేనిదీ గుర్తించాలని వాటర్​బోర్డు ఎండీ అధికారులను ఆదేశించారు. లేకుంటే వెంటనే మీటర్​ఫిక్స్​చేసుకోవాలని ఇంటి యజమానులకు సూచించాలని తెలిపారు.