- కొత్త పైప్ లైన్ కోసం నిధులిచ్చినా పనులు మొదలుపెట్టనందుకు సస్పెన్షన్ వేటు
హైదరాబాద్: జలమండలి మేనేజర్, వర్క్ ఇన్‌స్టెక్టర్‌ను సస్పెండ్ చేశారు ఎండీ దానకిశోర్. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెన్షన్ వేటు వేశారు జలమండలి ఎండీ దానకిశోర్. ముషీరాబాద్ లో కలుషిత నీటి సమస్యలను అరికట్టడానికి కొత్త పైప్‌లైన్ మంజూరు చేసి వారం రోజులు గడుస్తున్నా మేనేజర్, వర్క్ ఇన్‌స్టెక్టర్లు కొత్త పైపు నిర్మాణ పనులు మొదలుపెట్టకపోవడంతో ఎండీ దానకిశోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అత్యవసరమైన సురక్షిత తాగునీటి విషయంలో నిర్లక్ష్యం తగదని ఆయన పేర్కొన్నారు.
ముషీరాబాద్‌లో కలుషిత నీటి సమస్యలను నివారించడానికి కొత్త పైప్ లైన్ నిర్మాణం కోసం వారం రోజుల క్రితం రూ.4.2 లక్షల నిధులు మంజూరు చేశారు జలమండలి ఎండీ. అయితే వారం రోజులు గడిచినా పైపు లైన్ నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంతో ఇద్దరిపై క్రమశిక్షణ చర్యగా సస్పెన్షన్ వేటు వేశారు జలమండలిఎండీ దానకిశోర్.
ఇవి కూడా చదవండి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే డ్రామాలు ఆడుతున్నాయి
అప్పులు కట్టలేం.. చేతులెత్తేసిన ప్రభుత్వం