ఫిల్లింగ్​ స్టేషన్​ తనిఖీ చేసిన ఎండీ ఈడీ

ఫిల్లింగ్​ స్టేషన్​ తనిఖీ చేసిన ఎండీ ఈడీ

హైదరాబాద్​సిటీ,వెలుగు : మాదాపూర్ ఫిల్లింగ్ స్టేషన్ ను వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ట్యాంకర్ల సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంటూ డ్రైవర్లతో మాట్లాడారు. బుకింగ్స్‌‌‌‌కు లేక వాటర్​ట్యాంకర్లు ఖాళీగా ఉంటున్నాయని వారు ఎండీకి తెలిపారు. ట్యాంక‌‌‌‌ర్ బుకింగ్ స్టేట‌‌‌‌స్, రోజుకి ఎన్ని ట్యాంక‌‌‌‌ర్లు బుక్ అవుతున్నాయి?, ఎన్ని డెలివ‌‌‌‌రీ చేస్తున్నారు? త‌‌‌‌దిత‌‌‌‌ర వివ‌‌‌‌రాలడిగి తెలుసుకున్నారు. మాదాపూర్‌‌‌‌ ఫిల్లింగ్ స్టేష‌‌‌‌న్ లో ఆరు ఫిల్లింగ్ పాయింట్స్, 80 ట్యాంక‌‌‌‌ర్లు ఉండ‌‌‌‌గా రోజుకు 600 ట్రిప్పులు డెలివ‌‌‌‌రీ చేస్తున్నట్టు తెలిపారు.

రాబోయే రోజుల్లో 1200 బుకింగ్స్ వచ్చినా డెలివరి చేసే సామర్థ్యం ఉందని అధికారులు ఎండీకి వివరించారు. ఈ సందర్భంగా ఎండీ అశోక్​రెడ్డి మాట్లాడుతూ వేసవిలో నీటి డిమాండ్ ను ఎదుర్కోవడానికి అధికారులంతా సిద్ధంగా ఉండాలని, ట్యాంకర్ బుక్ చేసిన వెంటనే డెలివరీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మెరుగైన సేవలందించేందుకు అవసరాలుంటే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వాటిని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఈడీ మాయంక్‌‌‌‌ మిట్టల్‌‌‌‌ కూడా ఆదివారం షాపూర్‌‌‌‌నగర్, మౌలాలి, ఎల్లారెడ్డి గూడ ఫిల్లింగ్‌‌‌‌ స్టేషన్లను తనిఖీ చేశారు. ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేష‌‌‌‌న్ ఇన్ చార్జీలతో మాట్లాడి వివ‌‌‌‌రాలు క‌‌‌‌నుక్కున్నారు.

నీటి సరఫరాలో అంతరాయం

మసీద్ బండ సెక్షన్ లో టీజీఎన్​పీడీసీఎల్​నిర్వహణ పనులు చేపడుతుండడంతో ఆ సెక్షన్ పరిధిలోని ఫిల్లింగ్ స్టేషన్లకు కరెంట్​సరఫరా నిలిచిపోయింది. దీంతో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేశామని అధికారులు తెలిపారు. ఒకే ఫిల్లింగ్ స్టేషన్ తో ( గ్రావిటీ ద్వారా నడిచే) ట్యాంకర్లలో నీటిని నింపామన్నారు.