హైదరాబాద్ మహానగర నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు (HMWSSB) అధికారిక వెబ్‌సైట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన కేటుగాళ్లు టెక్నాలజీ సాయంతో నగర వాసులను బెట్టింగ్, ఆన్‌లైన్ రమ్మీ, కాసినోల వైపు మళ్లించారు. ఈ వ్యవహారం హైదరాబాద్ వాసుల్లో గందరగోళం సృష్టిస్తోంది.
హైదరాబాద్ ప్రజలు వాటర్ బిల్లులు చెల్లించడానికి HMWSSB వెబ్‌సైట్ ఉపయోగిస్తుంటారు. ఎప్పటిలానే కొందరు తమ నీటి బిల్లులు చెల్లించడానికి వెబ్‌సైట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హ్యాక్ చేసిన ఆగంతకులు అనుమానాస్పద లింక్స్ గూగుల్ న్యూస్‌లో ప్రత్యక్షమయ్యేలా చేశారు. ఇవి వినియోగదారులను ఆన్లైన్ బెట్టింగ్ betwww20.com, Rummy గేమ్స్ వైపు మళ్లించాయి.
ఈ హ్యాకింగ్ ఎప్పుడు జరిగిందనేది తెలియరాలేదు. ప్రస్తుతానికైతే HMWSSB అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ అవ్వడం లేదు.