అలర్ట్.. మరో 2 గంటలు భారీ వర్షం.. వాతావరణ శాఖ హెచ్చరిక

అలర్ట్.. మరో 2 గంటలు భారీ వర్షం.. వాతావరణ శాఖ హెచ్చరిక

 హైదరాబాద్ లో ఈదురు గాలులు, వడగండ్ల వానలు పడుతున్నాయి. మరో రెండు గంటల పాటు (ఏప్రిల్ 18న రాత్రి8 గంటల 30 నిమిషాల వరకు )నగరంలోని పలు చోట్ల భారీ వర్షం పడుతుందని వాతవరణ శాఖ హెచ్చరించింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. పంజాగుట్ట,జూబ్లీహిల్స్,బంజారాహిల్స్,అమీర్ పేట,బోరబండ, సనత్ నగర్, కూకట్ పల్లి,లింగంపల్లి, హైటెక్ సిటీ,కొండాపూర్,గచ్చిబౌలి,ఫిలీంనగర్,కోకాపేట్,మణికొండ,లక్డీకపూల్,రాజేంద్రనగర్,మెహదీపట్నం

 ఒక్కసారిగా మారిన వాతావరణం తో భారీగా గాలి వాన కురుస్తుంది..ప్రకృతి విలయం చేస్తుందన్న రీతిలో గాలితో కూడిన వర్షం పడుతుంది..బేగంపేట, రాణిగంజ్,ప్యారడేజ్,ప్యాట్నీ, మారేడ్ పల్లి,సీతాఫల్ మండి,మోండా మార్కెట్,రెజిమెంటల్ బజార్, బోయిన్ పల్లి తోపాటు తదితర ప్రాంతాల్లో భారీ ఈదురు గాలితో కుడి వర్షం పడుతుంది. భారీగా కురుస్తున్న గాలి వానకు చెట్లు విరిగిపడుతున్నాయి. రోడ్డు మార్గాన వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.