హైదరాబాద్,వెలుగు: గ్రేటర్ పరిధిలో గురువారం భారీ వర్షం కురిసింది. ఉదయం వాతావరణం చల్లగా ఉండగా, మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మబ్బులు కమ్మేశాయి. సాయంత్రానికి చినుకులతో మొదలైన వాన అర్ధరాత్రి వరకు దంచికొట్టింది. కూకట్పల్లిలో అత్యధికంగా గంటసేపట్లో 4.1 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా హైదర్నగర్లో 4.58, బాలాజీనగర్లో 3.23, కుత్బుల్లాపూర్లో 3.18, పటాన్చెరులో 2.95 సెంటీమీటర్ల వాన పడింది.
రోడ్లపై వరద నీరు నిలవడంతో చాలాచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే టైంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఐటీ ఉద్యోగులు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.