హైదరాబాద్ సిటీలో వర్షం.. కూల్ కూల్ వెదర్

హైదరాబాద్ సిటీలో వర్షం.. కూల్ కూల్ వెదర్

హైదరాబాద్ సిటీలోని కూకట్ పల్లి, కేపీహెచ్ బీ కాలనీ, నిజాంపేట, మూసాపేట, బాలానగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, అశోక్ నగర్, బీహెచ్ ఈఎల్, కొండాపూర్, రాయదుర్గం, మియాపూర్, మదీనాగూడ, చందానగర్ ఏరియాల్లో వర్షం పడుతుంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి బలహీనపడడంతో గత రెండు మూడు రోజులుగా హైదరాబాద్ నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. మార్చి 22 నుంచి మార్చి 24 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం (మార్చి 24) ఉదయం నుంచి చల్లబడిన వాతావరణం మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మేఘాలతో కమ్ముకుంది. 

ALSO READ | MLC Election: హైదరాబాద్లో మోగిన ఎన్నికల నగారా

దీంతో ఇవాళ హైదరాబాద్ లో వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం వరకు వానలు మరింత విస్తరించే అవకాశంఉందని చెబుతున్నారు. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బయటకు వెళ్లే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అధికారులు.