
తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ భాఖ హెచ్చరించింది. క్యూమిలోనింబస్ మేఘాలు కమ్ముకొని అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండలు, మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. సాయంత్రం వరకు ఈదురుగాలులు, వడగడ్ల వానలు కురుస్తున్నాయి.
ఏప్రిల్ 19న ఉరుములు, మెరుపులు , ఈదురు గాలులు గాలి వేగం గంటకు 30-40 కి.మీతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
►ALSO READ | ఉపాధి పనికి కుమ్రంభీం మనవడు
ఏప్రిల్ 20న ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది..
ఇక వచ్చే మూడు రోజులు అధిక ఎండలు నమోదయ్యే అవకాశం.. ప్రస్తుతం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. అధిక ఎండలతో పలు ఉత్తర, ఈశాన్య జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ..