
హైదరాబాద్ వైల్డ్ హార్ట్ పబ్ పై పోలీసులు సోమవారం (ఏప్రిల్ 14) రాత్రి మెరుపుదాడి చేశారు. పబ్ కు ఫ్రీ ఎంట్రీ ఇచ్చి ఒంటరిగా ఉన్న యువకులకు ముంబై యువతులను ఎరగా వేస్తున్నారు నిర్వాహకులు. యువకులను మత్తులో దించి మద్యం, బిల్ యువకుడి ఖాతాలో వేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. చైతన్యపురిలో ఉన్న ఈ పబ్ నిర్వాహకుల వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదు మేరకు sot పోలీసులు రైడ్ చేశారు. పబ్ లో సోదాలు నిర్వహించారు.
కస్టమర్స్ ను అట్రాక్ట్ చేసేందుకు ముంబైనుంచి యువతులను రప్పించారు పబ్ నిర్వాహకులు. యువకులను ఫ్రీగా పబ్ కు ఎంట్రీ ఇచ్చి.. వారి ముందు అర్థరాత్రి దాటాక యువతులతో డ్యాన్స్ లు వేయిస్తారు. దీంతో యువత మత్తులో మునిగిపోతూ అసభ్యకర డ్యాన్సులతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా పబ్ ను నడుపుతున్న యజమానితో పాటు 17 మంది ముంబై నుంచి వచ్చిన యువతులను అదుపులోకి తీసుకున్నారు.