హైదరాబాద్ నగరాన్ని దేశానికి రెండవ రాజధానిగా చేస్తామన్నారు ఏఐసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మల్కాజిగిరి స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున లోక్ సభ కు పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. తాను గెలిస్తే ఈ అంశంపై పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతానని చెప్పారు. సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న క్రమంలో దేశానికి రెండో రాజధాని తప్పనిసరని.. అది కూడా హైదరాబాద్ రాజధానిగా చేయాల్సిన తక్షణ అవసరం ఉందన్నారు. నిజానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ హైదరాబాద్ ను దేశానికి రాజధానిగా స్వాతంత్య్రానికి పూర్వమే ప్రతిపాదించారని.. తర్వాత కనీసం రెండో రాజధానిగా చేయాలని అయన చెప్పారని తెలిపారు. దశాబ్దాలుగా ఈ ప్రతిపాదన అతీగతీ లేకుండా అలాగే ఉందని తాను గెలిస్తే దానిపై ప్రైవేట్ బిల్లు పెట్టి పునాది వేస్తామన్నారు రేవంత్ రెడ్డి.