రంజీ ట్రోఫీ ప్లేట్ ఫైనల్లో హైదరాబాద్ గెలుపు

  రంజీ ట్రోఫీ ప్లేట్ ఫైనల్లో హైదరాబాద్ గెలుపు

 

  •     5 వికెట్ల తేడాతో ఓడిన మేఘాలయ
  •      రాణించిన తిలక్, రాహుల్

 
హైదరాబాద్, వెలుగు: రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్ విజేతగా నిలిచింది. ఉప్పల్ స్టేడియంలో  మంగళవారం ముగిసిన ఫైనల్లో   హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో మేఘాలయపై విజయం సాధించింది. మేఘాలయ ఇచ్చిన 198 రన్స్‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను ఐదు వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది.  కెప్టెన్ తిలక్ వర్మ (50 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 64),  రాహుల్ సింగ్ (40 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 62), రోహిత్ రాయుడు (34) రాణించారు. 

ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 71/1తో నాలుగో రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్ ఆరంభంలోనే తనయ్ త్యాగరాజ్ (26), రాహుల్ వికెట్లు కోల్పోయింది. అయితే, రోహిత్ రాయుడుతో కలిసి  దూకుడుగా ఆడిన తిలక్ నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు 82 రన్స్ జోడించి  ఛేజింగ్‌‌‌‌‌‌‌‌ను వన్‌‌‌‌‌‌‌‌సైడ్ చేశాడు.  మేఘాలయ బౌలర్లలో చెంగ్‌‌‌‌‌‌‌‌కం సంగ్మా మూడు వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో కీలక సెంచరీ చేసిన నితేశ్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఫైనల్ చేరడంతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, మేఘాలయ ఎలైట్ గ్రూప్‌‌‌‌‌‌‌‌కు క్వాలిఫై అయ్యాయి.  

 ఇప్పుడు పది లక్షలు... ఎలైట్ ట్రోఫీ గెలిస్తే రూ. కోటి ప్రైజ్‌‌‌‌‌‌‌‌మనీ

ప్లేట్ ఫైనల్లో గెలిచిన హైదరాబాద్ టీమ్‌‌‌‌‌‌‌‌కు హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ ప్రెసిడెంట్ ఎ. జగన్ మోహన్ రావు రూ.10 లక్షల నజరానా ప్రకటించారు.  ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌ నితేశ్ రెడ్డి, 10 వికెట్లు పడగొట్టిన తనయ్‌‌‌‌‌‌‌‌, సెంచరీ కొట్టిన ప్రజ్ఞయ్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, కెప్టెన్ తిలక్‌‌‌‌‌‌‌‌కు తలో రూ.50 వేల ప్రైజ్‌‌‌‌‌‌‌‌మనీ ఇస్తున్నట్టు తెలిపారు. రాబోయే మూడేండ్లలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ రంజీ ఎలైట్ ట్రోఫీ గెలిస్తే టీమ్‌‌‌‌‌‌‌‌కు రూ. కోటితో పాటు  ప్రతి ప్లేయర్‌‌‌‌‌‌‌‌కు బీఎండబ్ల్యూ కారు- బహుమతిగా ఇస్తానని ప్రకటించారు.