ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్ గెలుస్తుందనుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ తుది పోరులో చేతులెత్తేసింది. కనీస పోరాట పటిమ ప్రదర్శించకుండా చిత్తు చిత్తుగా ఓడిపోయింది. టోర్నీ అంతటా అదిరిపోయే ఆటతీరుతో చెలరేగిన హైదరాబాద్ జట్టు చివరి మెట్టుపై బోల్తా పడింది. ఏకపక్షంగా సాగిన టైటిల్ పోరులో కేకేఆర్‌కు పోటీ ఇవ్వలేక రెండోసారి టైటిల్ గెలిచే అద్భుతం అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంది. మొదట బ్యాటింగ్, ఆ తర్వాత బౌలింగ్ లో ఘోరంగా విఫలమై 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
ఈ మ్యాచ్ లో ఓటమి బాధలో ఉన్న సన్ రైజర్స్ కు చిన్న ఓదార్పు దక్కింది. ఐపీఎల్ సీజన్ 2024 లో హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో పిచ్ కు బెస్ట్ అవార్డు వరించింది. మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన సెర్మనీలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ అవార్డుతో పాటు 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీని అందుకుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ సీజన్‌లో బ్లాక్ బస్టర్ మ్యాచ్ లను అందించిన సంగతి తెలిసిందే. చెన్నైలోని చెపాక్, ముంబై లోని వాంఖడే, కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ ఉన్నప్పటికీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంకు ఈ అవార్డు రావడం గర్వించదగ్గ విషయం.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ కేకేఆర్ బౌలర్లు విజృంభించడంతో 113 రన్స్‌కే ఆలౌటైంది. ఇప్పటి వరకు జరిగిన 17 ఫైనల్స్‌లో ఇదే అతి తక్కువ స్కోరు. కోల్‌కతా 10.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేజ్ చేసి ఈజీగా గెలిచింది. స్టార్క్ కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇది కేకేఆర్ కు మూడో ఐపీఎల్ టైటిల్ కావడం విశేషం.
Wow! 🎉 We received Rs. 50,00,000 prize money for our Uppal Stadium pitch and ground—awarded Best Pitch and Ground in IPL matches! Huge thanks to Chandu and his team. Congrats to the HCA family! 🙌 #Grateful #HCA #TeamEffort @BCCI @SunRisers @IPL pic.twitter.com/ESMtAXkyd7
— Jagan Mohan Rao Arishnapally (@JaganMohanRaoA) May 26, 2024