ప్లే ఆఫ్స్‌ బెర్త్‌‌ దక్కించుకున్న హైదరాబాద్

ముంబైపై హైదరాబాద్ విక్టరీ

ప్లే ఆఫ్స్‌ బెర్త్‌‌ కైవసం
చెలరేగిన వార్నర్​, సాహా
కోల్‌‌కతాకు నిరాశ

ప్లే ఆఫ్స్‌‌‌‌ బెర్త్‌‌‌‌ దక్కాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌‌‌లో సన్‌‌‌‌ రైజర్స్‌‌‌‌.. ఫుల్‌‌‌‌ రైజ్‌‌‌‌ అయ్యింది..! బౌలింగ్‌‌‌‌లో సందీప్‌‌‌‌ (3/34), షాబాజ్​ నదీమ్​(2/19)  తడాఖా చూపెట్టడంతో.. పటిష్టమైన ముంబైని కట్టడి చేసిన ఆరెంజ్‌‌‌‌ ఆర్మీ.. టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లోనూ దంచికొట్టింది..! కెప్టెన్‌‌‌‌ డేవిడ్‌‌‌‌ వార్నర్‌‌‌‌ (58 బాల్స్‌‌‌‌లో 10 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 85 నాటౌట్‌‌‌‌), వృద్ధిమాన్‌‌‌‌ సాహా (45 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 58 నాటౌట్‌‌‌‌) వీరోచిత ఇన్నింగ్స్‌‌‌‌ ఆడి.. టీమ్‌‌‌‌కు కీలక విజయాన్ని కట్టబెట్టారు..! దీంతో నాకౌట్‌‌‌‌ బెర్త్‌‌‌‌పై భారీ ఆశలు పెట్టుకున్న కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌కు నిరాశకు తప్పలేదు..! సేమ్‌‌‌‌ పాయింట్లున్నా.. నెట్‌‌‌‌ రన్‌‌‌‌రేట్‌‌‌‌లో వెనుకబడిన మోర్గాన్‌‌‌‌సేన ఇంటిముఖం పట్టగా, మెరుగైన రన్‌‌‌‌రేట్‌‌‌‌తో హైదరాబాద్‌‌‌‌ మూడో ప్లేస్‌‌‌‌ను దక్కించుకుంది..!!

షార్జా: సూపర్‌‌ పెర్ఫామెన్స్‌‌తో అదరగొట్టిన హైదరాబాద్‌‌.. ఐపీఎల్‌‌–13 లీగ్‌‌ దశను విజయంతో ముగించింది. నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌‌లో ప్లేయర్లందరూ సమష్టిగా పోరాడటంతో.. మంగళవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో 10 వికెట్ల తేడాతో ముంబైపై గెలిచింది. దీంతో ప్లే ఆఫ్స్‌‌ బెర్త్‌‌ను సొంతం చేసుకుంది. మరోవైపు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి బరిలోకి దిగిన రోహిత్‌‌సేన.. బౌలింగ్‌‌లో తేలిపోయింది. ముందుగా బ్యాటింగ్‌‌ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 రన్స్‌‌ చేసింది. పొలార్డ్‌‌ (25 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41) టాప్‌‌ స్కోరర్‌‌. సూర్యకుమార్‌‌ (29 బాల్స్‌‌లో 5 ఫోర్లతో 36), ఇషాన్‌‌ కిషన్‌‌ (30 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 2 సిక్సర్లతో 33) రాణించారు.  తర్వాత హైదరాబాద్‌‌ 17.1 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 151రన్స్‌‌ చేసి నెగ్గింది. నదీమ్‌‌కు ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.

పొలార్డ్‌‌ మెరుపులు..

టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన ముంబైకి ఓపెనర్లు శుభారంభానివ్వలేదు. ఐదు ఓవర్లు పూర్తి కాకముందే రోహిత్‌‌ (4), డికాక్‌‌ (13 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25) పెవిలియన్‌‌కు చేరారు. సందీప్‌‌ వేసిన మూడో ఓవర్‌‌ మూడో బాల్‌‌కు షాట్‌‌ ఆడబోయి మిడాఫ్‌‌లో వార్నర్‌‌కు చిక్కాడు. ఐదో ఓవర్‌‌లో వరుసగా 4, 6, 6 కొట్టిన డికాక్‌‌.. సందీప్‌‌ దెబ్బకు క్లీన్‌‌బౌల్డ్‌‌ అయ్యాడు. దీంతో 39 రన్స్‌‌కు 2 వికెట్లు కోల్పోయిన ముంబైని ఆదుకునే బాధ్యత తీసుకున్న సూర్యకుమార్‌‌, కిషన్‌‌ మెల్లగా ఆడారు. నదీమ్‌‌ వేసిన ఆరో ఓవర్‌‌లో సూర్య రెండు ఫోర్లు కొట్టడంతో పవర్‌‌ప్లేలో ముంబై 48/2 స్కోరు చేసింది. తర్వాతి ఓవర్‌‌లో సూర్య ఇచ్చిన రిటర్న్‌‌ క్యాచ్‌‌ను నటరాజన్‌‌ డ్రాప్‌‌ చేశాడు. 8వ ఓవర్‌‌లో స్పిన్నర్‌‌ రషీద్‌‌ (1/32) రావడంతో స్కోరుకు అడ్డుకట్ట పడింది. ఈ ఓవర్‌‌లో 7, తర్వాతి ఓవర్‌‌లో 6 రన్సే వచ్చాయి. కానీ రషీద్‌‌ బౌలింగ్​లో సూర్య, కిషన్‌‌ 4, 6 బాదడంతో 13 రన్స్‌‌ వచ్చాయి. ఓవరాల్‌‌గా ఫస్ట్‌‌ టెన్‌‌లో ముంబై 78/2 స్కోరు సాధించింది. అయితే తర్వాతి ఓవర్‌‌లో 3 రన్సే రాగా, 12వ ఓవర్‌‌లో నదీమ్‌‌ (2/19).. ముంబైకి డబుల్‌‌ షాక్‌‌ ఇచ్చాడు. ఫస్ట్‌‌, నాలుగో బాల్‌‌కు వరుసగా సూర్యకుమార్‌‌, క్రునాల్‌‌ (0)ను ఔట్‌‌ చేశాడు.  మూడో వికెట్‌‌కు 42 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయ్యింది. ఆ వెంటనే రషీద్‌‌.. సౌరభ్‌‌ తివారి (1)ని బోల్తా కొట్టించాడు. 15వ ఓవర్‌‌లో కిషన్‌‌ ఇచ్చిన ఈజీ క్యాచ్‌‌ను రషీద్‌‌ వదిలేశాడు. పొలార్డ్‌‌ ఎల్బీ కోసం అప్పీల్‌‌ చేసినా రివ్యూలో గట్టెక్కాడు. లాస్ట్‌‌ ఐదు ఓవర్లలో 20 రన్స్‌‌ చేసిన ముంబై 3 వికెట్లు కోల్పోవడంతో స్కోరు 98/5గా మారింది. ఒత్తిడి పెరగడంతో పొలార్డ్‌‌.. 16వ ఓవర్‌‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. తర్వాతి ఓవర్‌‌లో భారీ సిక్సర్‌‌ కొట్టిన కిషన్‌‌.. ఆ వెంటనే ఔట్‌‌కావడంతో ఆరో వికెట్‌‌కు 33 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. నాలుగు బాల్స్‌‌ తర్వాత  కూల్టర్‌‌నైల్‌‌ (1) వెనుదిరిగాడు. 19వ ఓవర్‌‌లో పొలార్డ్‌‌ వరుసగా 6, 6, 6తో 20 రన్స్‌‌ పిండుకున్నాడు. లాస్ట్‌‌ ఓవర్‌‌లో సిక్స్‌‌ కొట్టి పొలార్డ్‌‌ ఔటైనా ముంబై 150 టార్గెట్‌‌ను నిర్దేశించింది.

సాహో.. వార్నర్‌‌

టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో హైదరాబాద్‌‌ ఓపెనర్లు వార్నర్‌‌, సాహా  పోటీపడి ఆడారు. ఒకర్ని మించి ఒకరు బౌండ్రీలతో విరుచుకుపడటంతో ముంబై బౌలర్లు తేలిపోయారు. సెకండ్‌‌ ఓవర్‌‌లో సాహా 6, 4, తర్వాత మరో రెండు ఫోర్లు బాదగా, నాలుగో ఓవర్‌‌లో వార్నర్‌‌.. హ్యాట్రిక్‌‌ ఫోర్స్‌‌ కొట్టాడు. ఐదో ఓవర్‌‌లో చెరో ఫోర్‌‌ కొట్టడంతో పవర్‌‌ప్లేలో హైదరాబాద్‌‌ 56 రన్స్‌‌ చేసింది.  ఫీల్డింగ్‌‌ సడలించిన తర్వాత కూడా  వార్నర్‌‌, సాహా ఆటలో మార్పు రాలేదు. దీనికితోడు  స్పిన్నర్లు చహర్‌‌, క్రునాల్‌‌ కూడా రన్స్‌‌ కట్టడి చేయలేకపోయారు. ఫలితంగా సింగిల్స్‌‌తో పాటు వీలైనప్పుడల్లా బౌండరీలు బాదిన ఈ జోడీ.. నాలుగు ఓవర్లలో 33 రన్స్‌‌ రాబట్టింది. దీంతో తొలి 10 ఓవర్లలో ఎస్‌‌ఆర్‌‌హెచ్‌‌ స్కోరు 89కి చేరింది. 11వ ఓవర్‌‌లో సాహా ఫోర్‌‌తో 8 రన్స్‌‌ రాబడితే.. తర్వాతి ఓవర్‌‌లో వార్నర్‌‌ 6, 4తో టీమ్‌‌ స్కోరును 100 దాటించాడు. ఈ క్రమంలో వార్నర్‌‌ 35, సాహా 34 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీలు పూర్తి చేశారు. చేయాల్సిన రన్‌‌రేట్‌‌ తగ్గడంతో సాహా, వార్నర్‌‌ కాస్త నెమ్మదించినా రన్‌‌రేట్‌‌ తగ్గలేదు. తర్వాతి మూడు (13 నుంచి 15) ఓవర్లలో 27 రన్స్‌‌ రావడంతో విక్టరీ ఈక్వేషన్‌‌ 30 బాల్స్‌‌లో 13గా మారింది. వార్నర్‌‌ రెండు ఫోర్లతో విజయాన్ని అందించాడు.

For More News..

ఇక అమ్మాయిల ధనాధన్‌