తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో వడగాలులు తీవ్రమయ్యాయి. వేసవి తీవ్రతకు తట్టుకోలే మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలోని పలు ఆసుపత్రులలో అక్యూట్ డయేరియా డిసీజ్ (ఎడిడి), వాంతులు,డీహైడ్రేషన్ కేసులు పెరుగుతున్నాయి. వేసవిలో వడగాలులు తీవ్రంగా వీస్తాయి కాబట్టి.. పిల్లలు జ్వరం బారిన పడే అవకాశంఎక్కువగా ఉంటుంది. కండ్లు మండడం తలనొప్పి..తల తిరగడం, మూత్రంలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు, విరేచనాలు వచ్చినప్పుడు పిల్లలను చల్లని ప్రదేశాల్లో ఉంచేలని వైద్యులు సలహ ఇస్తున్నారు. కొబ్బరి నీరు లేదా ORS వంటివి ఇవ్వాలని చెబుతున్నారు. వేసవి కాలంలో నీళ్లు ఎక్కువగా తాగుతూ నీడ పట్టున ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.