ఆరోగ్య పరుగులు.. మాదాపూర్​లో ఎకో రన్

ఆరోగ్య పరుగులు.. మాదాపూర్​లో ఎకో రన్

రేడియో మిర్చి, మైండ్​ స్పేస్​ ఆర్ఈఐటీ ఆధ్వర్యంలో ఆదివారం మాదాపూర్​లో ‘ఎకో రన్’ పేరిట 5కె, 10కె రన్​నిర్వహించారు. వందల మంది ఐటీ ఉద్యోగులు, యువతీ యువకులు, సీనియర్ ​సిటిజన్లు, రాజస్థాన్, పుదుచ్చేరి, మధురై సహా వివిధ ప్రాంతాల నుంచి అథ్లెట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ నుంచి రన్​లు మొదలై.. తిరిగి అక్కడే ముగిశాయి.

 ప్రారంభ కార్యక్రమంలో సినీ హీరోయిన్ చాందిని చౌదరి సందడి చేశారు. అలాగే మౌర్య ఫౌండేషన్, మైక్రో కేర్​ఈఎన్టీ హాస్పిటల్​ఆధ్వర్యంలో గచ్చిబౌలి ఇండోర్​స్టేడియంలో ‘రన్ ​ఫర్​ హియరింగ్​– డెసిబెల్ ​డాష్–2025’ ​పేరిట 2కె, 5కె, 10కె రన్ నిర్వహించారు. శాట్స్​చైర్మన్​ శివసేనారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. వినికిడి సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈ రన్​నిర్వహించారు.  – ఫొటోగ్రాఫర్, వెలుగు