- సూరారంలో ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యానికి మహిళ బలి
- ఇబ్రహీంపట్నంలో బైక్ అదుపుతప్పి యువకుడు..
- మరోచోట ఆటో, బైక్‌ను ఢీకొట్టిన కారు.. 12 మందికి గాయాలు
జీడిమెట్ల, వెలుగు: సిటీలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనల్లో అతివేగమే ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. సూరారంలో బైక్‌పై వెళ్తున్న దంపతులను వాటర్ ట్యాంకర్ ఢీ కొనడంతో మహిళ మృతి చెందింది. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన విష్ణుప్రియ (33), నరసింహారెడ్డి దంపతులు సిటీలోని సూరారంలో ఉంటూ ప్రైవేటు జాబ్‌లు చేస్తున్నారు.
రోజు మాదిరిగానే దంపతులిద్దరూ పనులు ముగించుకొని ఆదివారం రాత్రి బైక్‌పై ఇంటికి బయలుదేరారు. సూరారం లక్ష్మీనగర్ వద్ద వీరు వెళ్తున్న బైక్‌ను వాటర్ ట్యాంకర్ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ టైర్ కిందపడి విష్ణుప్రియకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ సోమవారం మృతి చెందింది.
అక్క ఇంటికి వెళ్తూ..
ఇబ్రహీంపట్నం, వెలుగు: బైక్ అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టడంతో యువకుడు మృతి చెందాడు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఇంజాపూర్ గ్రామానికి చెందిన సంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి (26) ఆదివారం రాత్రి బైక్‌పై లింగంపల్లిలోని తన అక్క ఇంటికి బయలుదేరాడు. ఇబ్రహీంపట్నంలోని మంచాల రోడ్డులో వేగంగా వెళ్తూ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టాడు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలు కావడంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు.