రోజుకు కనీసం 4 లీటర్ల వరకు నీళ్లు తాగాలని హెల్త్ కు మంచిదని చెబుతుంటారు కొందరు డాక్టర్లు. కొందరు ఇదే పనిగా నీళ్లు తాగేస్తుంటారు. ఏదైనా స్థాయికి మించితే అది ఆరోగ్యానికే ప్రమాదం. నీళ్లు ఎక్కువ తాగితే కూడా అది ఆరోగ్యానికి మంచిది కాదు. అనవసరంగా ప్రాణాల మీదకు వస్తుంది.
అసలేం జరిగిందంటే?
లేటెస్ట్ గా హైదరాబాద్ లో ఓ మహిళ ఉదయం నిద్రలేచిన వెంటనే ఒకేసారి 4 లీటర్ల నీళ్లు తాగి ఆస్పత్రి పాలైంది. ఐసీయూలో చికిత్స పూర్తయిన తర్వాత నాలుగురోజులకు ఆమెను డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. ఈ విషయాన్ని హైదరాబాద్ అపోలో ఆస్పత్రి న్యూరాలిజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ వెల్లడించారు.
డాక్టర్ సుధీర్ కుమార్ ఏం చెప్పాడంటే...40 ఏళ్ల మహిళ పొద్దున్నే లేచిన వెంటనే 4 లీటర్ల నీళ్లు తాగింది. నిద్రలేచిన తర్వాత అధికంగా నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు మొత్తం తొలగిపోతాయని.. ఆరోగ్యంగా ఉంటుందనే నమ్మకంతో ఆమె ఇలా చేసింది. ఎక్కువ నీళ్లు తాగడ వల్ల ఆ మహిళ తలనొప్పి,వికారం,వాంతులతో ఇబ్బంది పడింది. వెంటనే ఆమె మూర్చతో స్పృహ కొల్పోయింది. ఘటన అనంతరం కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె నీటి మత్తున బారిన పడిందని..అంటే వాటర్ పాయిజనింగ్ బారినపడినట్లు రుజువైందని డాక్టర్ సుధీర్ తెలిపారు
హైపోనట్రేమియా నిర్ధారణ
అధికంగా నీరు తాగడం వల్ల మహిళకు హైపోనాట్రేమియా (రక్తంలో సోడియం స్థాయిలు తక్కువగా ఉండటం) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆమె సీరమ్ సోడియం స్థాయి 110 mmol/L అని టెస్టుల్లో తేలింది. ఇది సాధారణ పరిధి 135-145 mmol/L కంటే చాలా తక్కువగా ఉంది.24 గంటల్లోనే ఆమె మానసిక స్థితి సాధారణ స్థితికి వచ్చినప్పటికీ ఆమెను 4వ రోజు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.
Also Read :- 750 రూపాయలు కట్టండి.. లక్షాధికారి కండి
ఉదయం అధికంగా నీరు తీసుకోవడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుందనే అపోహను డాక్టర్ తోసిపుచ్చారు. మూత్రపిండాలు సహజంగా మూత్రం ద్వారా శరీరాన్ని టాక్సిన్స్ క్లియర్ చేస్తాయి కాబట్టి ఉదయాన్నే ఎక్కువగా నీరు తీసుకోవడం అనవసరమని డాక్టర్ చెప్పారు
సూచనలు, సలహాలు
1. ఉదయం పూట అధికంగా నీరు తీసుకోవడం అవసరం లేదు. మూత్రపిండాలు సహజంగా మూత్రం ద్వారా శరీరాన్ని "టాక్సిన్స్" క్లియర్ చేస్తాయి. సాధారణ ఆర్ద్రీకరణ స్థితి మాత్రమే అవసరం.
2. రోజుకు దాదాపు 2.5 నుండి 3.5 లీటర్ల నీటిని అంటే ఒకేసారి కాకుండ రోజంతా తాగాలి. రోజువారీ నీటి అవసరాలలో దాదాపు 20 శాతం ఆహారం (ముఖ్యంగా పండ్లు), ఇతర పానీయాల (పాలు, టీ, రసం మొదలైనవి) నుండి కూడా వస్తుంది.
3. శరీరానికి నీటి శాతం ఎంత తీసుకోవాలనేది వయసు, ఆడ, మగ, టెంపరేచర్ ,వ్యయామం, ఏవైనా అనారోగ్యాలను బట్టి మారుతాయి.
4. ఆరోగ్యకరమైన కిడ్నీలు అదనపు నీటిని తీసుకోవడాన్ని తట్టుకోగలిగినప్పటికీ, గరిష్ట పరిమితి ఉంది. గంటకు 1.5 లీటర్ల కంటే ఎక్కువ లేదా అంతకంటే ఎక్కువ నీటిని తీసుకోవడం వల్ల నీటి మత్తు ఏర్పడుతుంది.
5. నీటి మత్తు కారణంగా తీవ్రమైన హైపోనాట్రేమియా వస్తుంది. వెంటనే గుర్తించడం వల్ల ప్రాణాల ముప్పు తగ్గించవచ్చు.
40-year-old drank plenty of water in the morning for "detoxification", but it resulted in a life-threatening complication
— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) December 22, 2024
40-year-old Ms Rajni (name changed) was told to drink water in the morning to detoxify her body. It was claimed that drinking excess water in the morning…