
బషీర్బాగ్, వెలుగు: ఆన్లైన్ జాబ్ పేరుతో ఓ యువతిని చీట్చేసి, సైబర్ నేరగాళ్లు రూ.3.56 లక్షలు కొట్టేశారు. ఆన్లైన్ జాబ్స్ ఫ్రమ్ ఫ్లిప్ కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్లిమిటెడ్పేరుతో ఇటీవల సిటీకి చెందిన యువతి(22)కి మెసేజ్ వచ్చింది. నిజమేనని నమ్మిన ఆమె లింక్ఓపెన్చేసి డీటెయిల్స్ఇచ్చింది. తర్వాత రూ.200 చెల్లించింది. తర్వాత కమీషన్అంటూ యువతి అకౌంట్కు రూ.100 వచ్చింది. తర్వాత రూ.1000కు రూ.250 కమీషన్ వచ్చింది.
తర్వాత వీఐపీ గ్రూప్ లో చేరితే పెద్ద మొత్తంలో కమీషన్ వస్తుందని మెసేజ్రావడంతో యువతి అందులో చేరింది. విడతల వారీగా రూ.3లక్షల56వేల680 ట్రాన్స్ఫర్చేసింది. తర్వాత ఎలాంటి కమీషన్రాకపోగా, ఇంకా డబ్బు పంపించాలని వార్నింగ్మెసేజ్లు రావడం మొదలయ్యాయి. మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.