హైదరాబాదీ ఉమన్..డ్రీమ్ రైడ్

హైదరాబాదీ ఉమన్..డ్రీమ్ రైడ్
  •     హిమాలయాల్లో వరల్డ్ లోనే ఎత్తైన రోడ్​పై ​సాహసయాత్ర
  •     ప్రతికూల పరిస్థితుల్లో 5 రోజులు.. వందల కి.మీలు జర్నీ
  •     ఒంటరిగా ప్రయాణించిన ఆక్యుపంక్చరిస్ట్ హారిక 
  •     ఉమ్లింగ్​లా పాస్ ను చేరిన తొలి హైదరాబాదీ  

హైదరాబాద్​, వెలుగు :  ఐదు రోజుల ప్రయాణం.. వందల కిలో మీటర్లు.  నిర్మానుష్యంగా రోడ్లు.. మంచుతో నిండిపోయిన ప్రాంతాలు.. ఎముకలు కొరికే చలి.. ఇలాంటి విపత్కర పరిస్థితులను తట్టుకుని ఒంటరిగా బైక్​పై1200 కి.మీ ప్రయాణించింది  హారిక మండలపు. వరల్డ్ లోనే ఎత్తైన రోడ్డు మార్గమైన ఉమ్లింగ్​లా పాస్​ను చేరుకుని తన డ్రీమ్​ను నిజం చేసుకుంది.  హైదరాబాద్ కు చెందిన ఆమె వృత్తిరీత్యా ఆక్యుపంక్చరిస్ట్ . బైక్ ​రైడింగ్ అంటే చాలా ఇష్టం. దీంతో ఎత్తైన రోడ్​పై రైడ్ చేయాలని నిర్ణయించుకుంది. ఉమ్లింగ్​లా పాస్​ భారత్–​ - చైనా బార్డర్ లో సముద్ర మట్టానికి19,024 అడుగుల ఎత్తులో ఉంటుంది.

ఎవరెస్టు బేస్​ క్యాంప్(17,598 అడుగులు)​ కంటే ఎక్కువ ఎత్తే. అక్కడికి చేరుకోవడం కూడా అంత ఈజీ కాదు. అలాంటి అడ్వెంచర్​చేయాలని ఆమె రెండేండ్లు ఎదురుచూసింది. గత మే 25న ఒంటరిగా బైక్ పై  ప్రయాణించింది. ఉమ్లింగ్​లా పాస్​పై రైడ్ చేసిన తొలి హైదరాబాద్ ​ఉమన్ గాను నిలిచింది. గత 4 ఏండ్లలో ఆ ప్రాంతానికి దేశంలో ఐదుగురు మహిళలు మాత్రమే వెళ్లారు.  ఏపీకి చెందిన డాక్టర్​ఇందు ఒకరు. కాగా హారిక కూడా ఇప్పుడు వారి లిస్ట్ లో చేరింది. 

 బైక్​రెంట్ కు తీసుకొని.. 

ముందుగా హారిక తన బెస్ట్​ ఫ్రెండ్​తో కలిసి లడఖ్​వెళ్లింది. తన ఫ్రెండ్ పదిరోజుల తర్వాత తిరిగి సిటీకి వచ్చింది. హారిక అక్కడే ఉండిపోయింది. ఉమ్లింగ్ లా పాస్​కు ప్రయాణానికి రెడీ అయింది. అక్కడ అడ్వెంచర్​చేసేవారు సొంత బైక్ లపై  వెళ్తుంటారు. మరికొందరు.. బైక్ లను ట్రైన్ ద్వారా తీసుకెళ్లి.. అక్కడ రైడ్ చేస్తుంటారు. హారికకు సొంత బైక్​లేదు. దీంతో లెహ్ ఏరియాలో బైక్​ను రెంట్​కు తీసుకుంది.

లెహ్, లడఖ్​ ఏరియాల్లో పెంట్రోల్​బంక్ లు చాలా తక్కువ ఉంటాయి. 3, 4 వందల కిలో మీటర్లకు ఒక బంక్​ ఉంటుంది. దీంతో పెట్రోల్​కోసం అదనపు ఏర్పాట్లు చేసుకుంది. చలిని, దుమ్ము ధూళిని తట్టుకునేందుకు.. అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఉమ్లింగ్​లా పాస్​పై బైక్ రైడ్ చేసింది. 

అతి తక్కువ టెంపరేచర్లు 

 టూరిస్టులు మే నుంచి సెప్టెంబర్​వరకు ఎక్కువగా వెళ్తుంటారు. అప్పుడు కూడా 2,3 డిగ్రీల టెంపరేచర్​ఉంటుంది. ఆక్సిజన్ ​లెవల్స్​ సాధారణం కంటే 50 శాతం తక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితులను అధిగమించి మొత్తం 24 రోజుల ట్రిప్​లో, 5 రోజులు బైక్​ పై దాదాపు 1200 కిలోమీటర్లు ప్రయాణించింది హారిక. గంటకు 20 కిలోమీటర్లు కూడా జర్నీ చేయడం కష్టమే. ఇందుకు కొన్ని ఆరోగ్య పరమైన సమస్యలను ఎదుర్కొంది.  తను ఆక్యుపంక్చరిస్ట్ కావడంతో  తానే వైద్యం చేసుకుంటూ ముందుకుసాగింది. తన డ్రీమ్​ను నిజం చేసుకుంది. 

జర్నీ..చాలా థ్రిల్లింగ్​ 

అక్కడికి వెళ్లేందుకు మొదట్లో భయపడ్డా. కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదు. రోడ్లు చాలా బాగుండగా.. చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఏదైనా యాక్సిడెంట్ కు గురైతే సాయం చేయడానికి కూడా ఎవరూ ఉండరు. అందమైన ప్రాంతాలను చూసేందుకే వెళ్లా.  వాటిని చూస్తూ నా డ్రీమ్ ను నిజం చేసుకున్నా. బైక్ పై జర్నీ చాలా థ్రిల్లింగ్​గా అనిపించింది. అక్కడికి వెళ్లిన తొలి హైదరాబాదీ ఉమన్​ను కావడం గర్వంగా ఉంది. 

– హారిక మండలపు, ఆక్యుపంక్చరిస్ట్​, హైదరాబాద్