భర్తకు అందంగా కనిపించాలని బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఓ మహిళ చేసిన ప్రయత్నం దారుణంగా బెడిసికొట్టింది. ఈ ఘటన హైదరాబాద్ లోని అబిడ్స్‌లో చోటు చేసుకుంది. తనని మోడల్ గా చూడాలనుకున్న భర్త కోరికను తీర్చడానికి మహిళా.. స్థానికంగా ఉన్న ఓ బ్యూటీ పార్లర్ కు వెళ్లింది. అక్కడ బ్యూటీషియన్ పొడుగ్గా ఉన్న ఆమె హెయిర్ ను కట్ చేసి హెయిర్ ఆయిల్ పెట్టింది. దీంతో మెల్లిమెల్లిగా ఆమె జట్టు రాలిపోవడం మొదలైంది.
దీంతో భార్య హెయిర్ పోవడం చూసి ఆమె భర్త ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. అందంగా కనిపించాలనుకున్న భార్యకున్న వెంట్రుకలు కూడా పోవడంతో తరుచుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీనికి కారణమైన బ్యూటీ పార్లర్, బ్యూటీషియన్ పైన కేసు పెట్టాలనుకున్న ఆ మహిళా.. ఊడిపోతున్న తన వెంట్రుకలని పట్టుకుని అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ:వానలు పడుతున్నాయి... కళ్లు జాగ్రత్త... ఎందుకంటే
బ్యూటీ పార్లర్ నిర్వాహకుల నిర్వాకంతో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఫేస్ వ్యాక్స్ చేయించుకున్న మహిళలకు ముఖంపై ఎర్రగా కంది నీటి పొక్కులు రావడం, ఫేస్‌మాస్క్ వికటించి మొహం నల్లగా మారిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. బ్యూటీషియన్లకు సరైన అవగాహన లేకపోవడం, నాణ్యమైన మెటీరియల్ వాడకపోవడంతో మహిళలకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి.