జైపూర్: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న హైదరాబాద్.. విజయ్ హజారే ట్రోఫీలో బోణీ చేసింది. టార్గెట్ ఛేజింగ్‌లో కెప్టెన్ రాహుల్ సింగ్ (70), చందన్ సహానీ (41) నిలకడగా ఆడటంతో.. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో మణిపూర్‌పై గెలిచింది. టాస్ ఓడిన మణిపూర్ 50 ఓవర్లలో 203 రన్స్‌కు ఆలౌటైంది.
మిటన్ కిషంగ్‌బామ్ (41), బికాస్ సింగ్ (41), ప్రియోజిత్ (38), జాన్సన్ సింగ్ (35) రాణించారు. రవితేజ 3, రక్షణ్ రెడ్డి, తనయ్ త్యాగరాజన్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత హైదరాబాద్ 29.5 ఓవర్లలో 208/5 స్కోరు చేసి నెగ్గింది. రోహిత్ రాయుడు (27), రాహుల్ బుద్ది (26), రవితేజ (23 నాటౌట్) ఫర్వాలేదనిపించారు.