రాహుల్ సింగ్ డబుల్ సెంచరీ.. హైదరాబాద్ ఇన్నింగ్స్ విక్టరీ

రాహుల్ సింగ్ డబుల్ సెంచరీ.. హైదరాబాద్ ఇన్నింగ్స్ విక్టరీ

సోవిమా: రంజీ ట్రోఫీని హైదరాబాద్‌‌‌‌ ఘన విజయంతో ప్రారంభించింది. బ్యాటర్లకు తోడు బౌలర్లు కూడా సత్తా చాటడంతో  ప్లేట్ డివిజన్‌‌‌‌లో భాగంగా రెండు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్‌‌‌‌లో చిన్న జట్టు నాగాలాండ్‌‌‌‌ను ఇన్నింగ్స్‌‌‌‌ 194 రన్స్‌‌‌‌ తేడాతో చిత్తు చేసింది. ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 35/1తో రెండో రోజు, శనివారం ఆట కొనసాగించిన నాగాలాండ్ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో  153 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. దాంతో హైదరాబాద్‌‌‌‌కు 321 రన్స్‌‌‌‌ ఆధిక్యం లభించింది. 

శ్రీనివాస్ (49) టాప్‌‌‌‌ స్కోరర్​ కాగా హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్‌‌‌‌ ఐదు, సీవీ మిలింద్, కార్తికేయ రెండే వికెట్లు పడగొట్టారు. అనంతరం ఫాలో ఆన్‌‌‌‌తో రెండో ఇన్నింగ్స్‌‌‌‌ ఆడిన నాగాలాండ్‌‌‌‌ 34.5 ఓవర్లలో 127 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. సుమిత్ కుమార్ (62)  ఒక్కడే పోరాడాడు. సీవీ మిలింద్ నాలుగు, తనయ్ మూడు వికెట్లతో రాణించారు. ఈ విజయంతో హైదరాబాద్ బోనస్‌‌‌‌ సహా ఏడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది.