హైదరాబాద్, వెలుగు: అక్షయ నందిగామ (124 నాటౌట్, 2/11) సెంచరీకి, రెండు వికెట్లతో సత్తా చాటడంతో బీసీసీఐ అండర్15 విమెన్స్ వన్డే టోర్నమెంట్‌లో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ సెక్టార్-1 గ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 194 పరుగుల తేడాతో మిజోరం జట్టును చిత్తు చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 35 ఓవర్లలో 266/3 పరుగులు చేసింది. అక్షయకు తోడు నిధి (83) హాఫ్ సెంచరీతో రాణించింది. ఛేజింగ్‌లో మిజోరం నిర్ణీత 35 ఓవర్లలో 72/8కి పరిమితం అయింది. జసింత (18) టాప్ స్కోరర్. అక్షయతో పాటు ఆష్తా శర్మ, సాయి తనుశ్రీ తలో రెండు వికెట్లు పడగొట్టారు.