
–హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్క్ వండర్లా 25వ వార్షికోత్సవ సందర్భంగా ‘మైండ్- బ్లోయింగ్ సమ్మర్స్’ ప్లాన్ ను ఆవిష్కరించింది. ఈ వేసవి ఉత్సవంలో పూల్ సైడ్ డీజే పార్టీలు, ఆమ్రాస్ ఫెస్టివల్, జుంబా సెషన్స్, నైట్పార్క్ ఇన్సియేటివ్తో పాటు ఫ్యామిలీ, స్టూడెంట్, అడ్వెంచర్స్కోసం స్పెషల్డిస్కౌంట్లను ప్రకటించింది.
స్పెషల్ ఫుడ్స్తో విజిటర్స్ను ఆకట్టుకుంటామని చెప్తోంది. ఈ సీజన్‌లో వీఆర్ మ్యాజిక్, హైపర్‌వర్స్, జీ-ఫాల్ వంటి అంతర్జాతీయ రైడ్స్‌తో అడ్వెంచర్, వాటర్ రైడ్స్, పూల్‌సైడ్ డ్యాన్స్ ఎంజాయ్చేయవచ్చని చెప్తోంది. టికెట్‌పై 20% తగ్గింపు ఇస్తున్నామని, సీనియర్ సిటిజన్లకు 50%, పిల్లలకు 20%, స్టూడెంట్లకు 25%–35% డిస్కౌంట్ఇస్తున్నట్టు వండర్లా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అరుణ్ తెలిపారు.