వన్డేలకు జడేజా, దయాల్‌‌‌‌ దూరం

వన్డేలకు జడేజా, దయాల్‌‌‌‌ దూరం

ఇండియా‑ఎ టీమ్‌‌‌‌లో చోటు

న్యూఢిల్లీ: హైదరాబాద్‌‌‌‌ యువ క్రికెటర్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ తిలక్‌‌‌‌ వర్మ బంగ్లాదేశ్‌‌‌‌ టూర్‌‌‌‌కు వెళ్లే ఇండియా–ఎ టీమ్‌‌‌‌కు ఎంపికయ్యాడు. ఈ టూర్‌‌‌‌లో భాగంగా ఇండియా–ఎ టీమ్‌‌‌‌.. బంగ్లాదేశ్‌‌‌‌–ఎతో  రెండు అనధికారిక టెస్టులు (4 రోజుల మ్యాచ్​) ఆడుతుంది. ఈ నెల 29–డిసెంబర్‌‌‌‌ 2 మధ్య తొలి పోరు, డిసెంబర్‌‌‌‌ 6-–9 మధ్య రెండో మ్యాచ్‌‌‌‌ జరుగుతుంది. అభిమన్యు ఈశ్వరన్‌‌‌‌ కెప్టెన్సీలోని ఈ జట్టులో యశస్వి జైస్వాల్‌‌‌‌, సర్ఫరాజ్‌‌‌‌ ఖాన్‌‌‌‌, యశ్‌‌‌‌ధూల్‌‌‌‌కు చోటు దక్కింది. రెండో మ్యాచ్‌‌‌‌లో ఇండియా టెస్టు ప్లేయర్లు పుజారా, ఉమేశ్‌‌‌‌తో పాటు కీపర్‌‌‌‌ కేఎస్‌‌‌‌ భరత్‌‌‌‌ బరిలో నిలిచారు. ఇక, బంగ్లాతో మూడు వన్డేల సిరీస్‌‌‌‌కు రవీంద్ర జడేజా, యంగ్‌‌‌‌ పేసర్‌‌‌‌ యష్‌‌‌‌ దయాల్‌‌‌‌ దూరమయ్యారు.  మోకాలి గాయం నుంచి జడ్డూ ఇంకా కోలుకోలేదు.  దయాల్‌‌‌‌ వెన్నుగాయానికి గురయ్యాడు. ఈ ఇద్దరి స్థానాల్లో సెలెక్షన్‌‌‌‌ కమిటీ.. కుల్దీప్‌‌‌‌ సేన్‌‌‌‌, షాబాజ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌లను టీమ్‌‌‌‌లోకి తీసుకుంది. డిసెంబర్‌‌‌‌ 4,7,10వ తేదీల్లో బంగ్లాతో ఇండియా మూడు వన్డేలు ఆడుతుంది. అదే నెల 14–18, 22–26 మధ్య రెండు  టెస్టు మ్యాచ్‌‌‌‌ల్లో పాల్గొంటుంది.