ఈవెంట్లో పెట్టుబడి పేరిట మోసం

ఈవెంట్లో పెట్టుబడి పేరిట మోసం
  •  రూ.1.10 లక్షలు కొట్టేసిన సైబర్ చీటర్స్

బషీర్​బాగ్, వెలుగు: ఈవెంట్, ఎక్స్​పోలలో పెట్టుబడి పేరిట ఓ యువకుడిని సైబర్ నేరగాళ్లు మోసగించారు. నగరానికి చెందిన 25 ఏళ్ల యువకుడు అనలిస్ట్ గా పని చేస్తున్నాడు. అతనికి రెండు నెలల క్రితం ఇన్​స్టాగ్రామ్​లో alhaadiislamic.expo అకౌంట్ నుంచి హైదరాబాద్ లో జరిగే ఈవెంట్స్, ఎక్స్​పోలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని మెసేజ్ వచ్చింది. అయితే, వారి ఆఫర్ ను మొదట బాధితుడు తిరస్కరించారు. మరల స్కామర్ నుంచి మెసేజ్ లు రావడంతో బాధితుడు మొత్తం రూ.1,10,000 లను ఇన్వెస్ట్ చేశాడు. 

అనంతరం ఈవెంట్ వాయిదా పడిందని కొన్ని రోజులు వేచి ఉంటే, లాభాలతో పాటు ఇన్వెస్ట్ చేసిన డబ్బులను చెల్లిస్తామని నమ్మబలికారు. రోజులు గడుస్తున్నా వారి నుంచి అదే సమాధానం వస్తుండడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శివమారుతి తెలిపారు.