హైదరాబాద్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ యువకుడు మృతిచెందాడు. పాతబస్తీకి చెందిన 30 ఏళ్ల మహ్మద్ ఆఫ్సన్ మృతిచెందినట్లు అతని కుటుంబ సభ్యులకు రష్యన్ ఎంబసీ సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉపాధి కోసం వెతుకుతున్న అఫ్సన్ ను హెల్పర్ ఉద్యోగం ఇప్పిస్తామని ఏజెంట్లు రష్యాకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే రష్యా,ఉక్రెయిన్ సరిహద్దుల్ల బలవంతంగా సైన్యంలోకి ఏజెంట్లు చేర్పించారు.
ఇటీవల తనను హైదరాబాద్ కు రప్పించాలని అఫ్సన్ కోరినట్లు తెలుస్తోంది. అఫ్సన్ ను హైదరాబాద్ కు రప్పించాలని గతంలో కేంద్రవిదేశాంగ శాఖకు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా కోరారు. ఇంతలోనే అఫ్సన్ చనిపోయినట్లు రష్యన్ ఎంబసీ అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. రష్యాలో చనిపోయిన అఫ్సన్ మృతదేహాన్ని హైదరాబాద్ కు రప్పించాలని కుటుంబ సభ్యులు విదేశాంఖ శాఖను విజ్ణప్తి చేసింది.