హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ కు రూ.22 లక్షల లాటరీ..

 జీవనోపాధి కోసం హైద‌రాబాద్‌ నుంచి మ‌స్కట్ వెళ్లిన ఓ వ్చక్తి బిగ్ టికెట్ అబుదాబి వీక్లీ డ్రాలో 100,000 దిర్హామ్ (రూ. 22,63,680) గ్రాండ్ ప్రైజ్‌ని గెలుచుకున్నాడు. హైద‌రాబాద్‌ కు చెందిన నరేష్ కుమార్ మస్కట్ లో గత 10 సంవత్సరాలుగా డ్రైవ‌ర్‌గా  ప‌ని చేస్తున్నాడు.  సహోద్యోగులు, స్నేహితులతో సహా పది మందితో కలిసి గత నాలుగేళ్లుగా బిగ్ టికెట్ కొనుగోలు చేస్తున్నాడు.

ALSO READ:  కాంగ్రెస్‌‌ గెలిస్తే మోదీ తీహార్‌‌కు..కేసీఆర్‌‌ చర్లపల్లి జైలుకు : పొన్నాల లక్ష్మయ్య

 తాను లాటరీ గెలుచుకునన్న విషయం తెలియగానే అతని అనందానికి అవధులు లేకుండా పోయాయి.  ఈ డబ్బులతో హైదరాబాద్ కు వెళ్లి బిజినెస్  చేస్తానని చెబుతున్నాడు  నరేష్.   ఇక 39 ఏళ్ల సౌదీ అరేబియాకు చెందిన భారతీయ ప్రవాసుడు ప్రమోద్ శశిధరన్ నాయర్, రాఫిల్ డ్రా నంబర్ 256 కోసం టికెట్ నంబర్ 010589 కొనుగోలు చేసి లక్కీ డ్రాలో అమెంట్ గెలుచుకున్నాడు. 

అతను తన సహచరులతో కలిసి గత నాలుగు సంవత్సరాలుగా డ్రాలో పాల్గొంటున్నాడు. గెలిచిన మొత్తంలో అతను తన భార్య కోసం భారతదేశంలో కారు కొనాలని ప్లాన్ చేశాడు.