దూసుకొస్తున్న యువ రాకెట్.. బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌లో రాణిస్తున్న హైదరాబాదీ రోహన్

హైదరాబాద్, వెలుగు: వరల్డ్ బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌లో తమదైన ముద్ర వేసిన హైదరాబాద్ నుంచి మరో యువ ఆటగాడు దూసుకొస్తున్నాడు. సిటీకి చెందిన 17 ఏండ్ల యంగ్ షట్లర్ ఆనందాస్​ రోహన్ కుమార్ బీడబ్ల్యూఎఫ్ జూనియర్ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌లో సత్తా చాటుతున్నాడు. జూనియర్ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుతం ఇండియా నుంచి అత్యధికంగా సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో 17వ ర్యాంక్​లో ఉన్నాడు.  గతేడాది అండర్ 17 నేషనల్ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా నిలిచిన రోహన్ ఈ మధ్యే ఇంటర్నేషనల్  సర్క్యూట్‌‌‌‌‌‌‌‌లోకి అడుగు పెట్టాడు. ఈ నెల 22 నుంచి 24 వరకు బెల్జియం జూనియర్ బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ సిరీస్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ టైటిల్ నెగ్గాడు. ఫైనల్లో అతను 21–16, 21–18తో అలెగ్జాండర్ బెష్ (జర్మనీ)ని ఓడించాడు. 

డబుల్స్‌‌‌‌‌‌‌‌లో  రణదీప్ సింగ్‌‌‌‌‌‌‌‌ (హర్యానా)తో జట్టు కట్టి రన్నరప్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. అంతకుముందు స్లొవేనియా జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో రన్నరప్ ట్రోఫీ నెగ్గిన రోహన్.. డబుల్స్‌‌‌‌‌‌‌‌లో మూడో ప్లేస్ సాధించాడు. ఈ నెల ఆరంభంలో జరిగిన పోలిష్ ఇంటర్నేషనల్ చాలెంజ్‌‌‌‌‌‌‌‌లో సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో థర్డ్ ప్లేస్ సాధించాడు. రోహన్ తండ్రి ఎ. రాజ్‌‌‌‌‌‌‌‌ కుమార్ మాజీ బీచ్‌‌‌‌‌‌‌‌ వాలీబాల్ ప్లేయర్ కాగా, తల్లి  రమాదేవి సరూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ స్టేడియంలో వాలీబాల్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్నారు. తల్లి స్ఫూర్తితో 2016లో బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌ లోకి వచ్చిన రోహన్ ప్రముఖ కోచ్ భాస్కర్ బాబా శిక్షణలో ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. మలేసియా లెజెండ్ లీ చోంగ్ వీని ఆరాధించే రోహన్ ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌తో పాటు వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌ అవ్వాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకున్నాడు.