బెంగళూరు తర్వాత మనదగ్గరే ఎక్కువ డిమాండ్
తర్వాత ముంబై, పుణే, ఢిల్లీ
టెక్ ఫైండర్ సర్వే
ముంబై: కరోనా సంక్షోభంతో కంపెనీల నుంచి కాంట్రాక్ట్ జాబ్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఐటీ సెక్టార్‌లో కాంట్రాక్ట్ జాబ్ నియామకాలు ఎక్కువగా ఉన్నాయి. దేశం మొత్తం మీద బెంగళూరు, హైదరాబాద్ సిటీల నుంచి ఈ జాబ్స్‌కు ఎక్కువ డిమాండ్ ఉందని కాంట్రాక్ట్ జాబ్స్‌ను పొస్ట్ చేసే టెక్‌ఫైండర్ ఓ సర్వేలో పేర్కొంది. ఈ సర్వే ప్రకారం దేశంలో కాంట్రాక్ట్ జాబ్స్‌కు ఉన్న డిమాండ్‌లో 29 శాతం బెంగళూరు, దేవనగిరి సిటీల నుంచి ఉందని తెలిపింది. ఈ రెండు సిటీలతో కర్నాటక ముందు వరసలో నిలిచిందని పేర్కొంది. 24 శాతం డిమాండ్‌తో తెలంగాణ(హైదరాబాద్, వరంగల్) తర్వాత స్థానంలో ఉందని తెలిపింది. 18 శాతంతో మహారాష్ట్ర(ముంబై, పుణే, నాగ్‌పుర్), 15 శాతంతో తమిళనాడు(చెన్నై, కొయంబత్తూర్), 14 శాతంతో ఢిల్లీ(ఢిల్లీ, న్యూఢిల్లీ) రాష్ట్రాలు తర్వాతి స్థానాలలో ఉన్నాయని ఈ సర్వే తెలిపింది. తమ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసుకున్న 42,000 మందిని సర్వే చేశామని టెక్‌ఫైండర్ పేర్కొంది. కాంట్రాక్ట్ జాబ్ మార్కెట్‌లో ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్ వరకు ఈ సర్వేను కంపెనీ నిర్వహించింది. చిన్న సిటీల నుంచి కూడా కాంట్రాక్ట్ జాబ్స్‌కు డిమాండ్ పెరుగుతోందని ఈ సర్వే పేర్కొంది. మొత్తం డిమాండ్‌లో టైర్ 1 సిటీల వాటా 58 శాతంగా ఉన్నప్పటికీ టైర్ 2 సిటీల నుంచి 32 శాతం, టైర్ 3 సిటీల నుంచి 10 శాతం డిమాండ్ ఉందని తెలిపింది. కరోనా సమస్యలు కొనసాగుతున్నప్పటికీ కాంట్రాక్ట్ జాబ్ మార్కెట్ పాజిటివ్‌గా ఉందని పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో 65 శాతం మంది మగవారు కాగా, 35 శాతం మహిళలు ఉన్నారని టెక్‌ఫైండర్ తెలిపింది. కాంట్రాక్ట్ జాబ్స్‌కు మహిళల నుంచి పెద్దగా ఆసక్తి లేదని ఈ సర్వే పేర్కొంది. టెక్‌ఫైండర్‌లో పోస్ట్ అవుతున్న జాబ్స్ యావరేజి కాంట్రాక్ట్ పీరియడ్ 6 –12 నెలలుగా ఉందని తెలిపింది.
ఐటీ సెక్టార్లోనే కాంట్రాక్ట్ జాబ్స్ ఎక్కువ..
తమ ప్లాట్‌ఫామ్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్లు, డేటా ఎనలిస్ట్‌లు, వెబ్ డెవలపర్లు, డేటా సైంటిస్టులు, జావా డెవలపర్‌లు, ఫుల్ స్టాక్ డెవలపర్ల కోసం కంపెనీలు ఎక్కువగా వెతుకుతున్నాయని టెక్‌ఫైండర్ సర్వే తెలిపింది. 22–44 ఏళ్ల మధ్య వయసున్న వారు తమ ప్లాట్‌ఫామ్‌లో యాక్టివ్‌గా ఉన్నారని పేర్కొంది. ఈ సర్వే ప్రకారం కేవలం ఐటీ సెక్టార్‌లోనే కాకుండా ఫార్మా, సేల్స్ అండ్ మార్కెటింగ్, టెలికమ్యూనికేషన్, ఇన్సూరెన్స్ సెక్టార్లలో కూడా కాంట్రాక్ట్ జాబ్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. 70 శాతం మంది విదేశాలలో పనిచేసేందుకు కాంట్రాక్ట్ జాబ్స్ వెతుకుతున్నారు. తాత్కాలికంగా ఉండి, టాస్క్‌కు తగ్గ వర్క్ వైపు జాబ్ మార్కెట్ షిఫ్ట్ అవుతోందని టెక్‌ఫైండర్ ఫౌండర్ ప్రవీణ్ మదిరే అన్నారు. ప్రస్తుత గ్లోబల్ పరిస్థితులకు అనుగుణంగా ఈ మార్పు వస్తోందని తెలిపారు. కాంట్రాక్ట్ జాబ్స్ వలన ఎంప్లాయర్లకు, ప్రొఫెషనల్స్‌కు దీర్ఘకాల ప్రయోజనాలున్నాయని అభిప్రాయపడ్డారు. కాంట్రాక్ట్ జాబ్ విధానంలో ప్రొఫెషనల్స్‌కు వర్క్ ఫ్రీడమ్ ఉంటుందని, తమకు నచ్చిన టైమ్‌లో వర్క్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని ప్రవీణ్ చెప్పారు. భవిష్యత్‌లో కాంట్రాక్ట్ జాబ్స్ రిక్రూట్ చేసుకోవడం సాధారణం అవుతుందని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రొఫెషనల్స్ షార్ట్‌టెర్మ్ కాంట్రాక్ట్ జాబ్స్‌పై ఆసక్తిగా ఉన్నారని పేర్కొన్నారు.
For More News..