
హైదరాబాద్, వెలుగు : బీసీసీఐ జూనియర్ విమెన్స్ అండర్19 వన్డే ట్రోఫీలో హైదరాబాద్ ఘన విజయం ఖాతాలో వేసుకుంది. నితీష (104) సెంచరీకి తోడు సంధ్య (88), ప్రతీక్ష (50 నాటౌట్) ఫిఫ్టీలతో రాణించడంతో శుక్రవారం త్రివేండ్రంలో జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 239 రన్స్ తేడాతో అరుణాచల్ ప్రదేశ్‌ను చిత్తుగా ఓడించింది.
తొలుత హైదరాబాద్ 50 ఓవర్లలో 323/6 స్కోరు చేసింది. ఛేజింగ్‌లో అరుణాచల్ 42 ఓవర్లలో 84 రన్స్‌కే ఆలౌటైంది. జాజ్మిన్ గిల్ 4, సృజన, శ్రీవల్లి చెరో రెండు వికెట్లు పడగొట్టారు.