హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్లో స్లీపింగ్ పాడ్స్.. ఏంటి వీటి ప్రత్యేకత?

హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్లో స్లీపింగ్ పాడ్స్.. ఏంటి వీటి ప్రత్యేకత?

హైదరాబాద్ చర్లపల్లిలో నూతనంగా ప్రారంభించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ ఎన్నో ప్రత్యేకతలకు నిలయంగా మారింది. స్టేషన్ లో అధునాతన సౌకర్యాలతో ప్రయాణికులకు సేవలు అందించేలా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ప్రయాణికుల అధునాతన స్లీపింగ్ పాడ్స్ సౌకర్యం కల్పించారు. 

అదేవిధంగా ఎక్జిక్యూటివ్ లాంజ్, స్త్రీ పురుషులకు వేరు వేరు వెయిటింగ్ ఏరియాలు, కేఫ్ టేరియా, భోజనశాలలు, ఎలివేటర్లు, ఎస్కులేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు మరెన్నో ఇతర అడ్వాన్స్ డ్ ఫెసిలిటీస్ కల్పించారు. ఎయిర్ పోర్టులలో ఉండే సౌకర్యాలు చర్లపల్లి రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేయడం విశేషం. 

ఇటీవల హైదరాబాద్ ఎయిర్ పోర్టులో స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు చేశారు. ప్యాసెంజర్లకు ప్రత్యేక ప్రశాంత విశ్రాంతి కేంద్రాలు ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన స్లీపింగ్ పాడ్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా తెలంగాణలో ఎక్కడా లేని స్లీపింగ్ పాడ్లను చర్లపల్లిలో ఏర్పాటు చేయడం శుభ పరిణామం.

ALSO READ | ఫార్ములా ఈ కేసు.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేటీఆర్

ఈ స్లీపింగ్ పాడ్స్ స్టార్టింగ్ ఫీజు 500 రూపాయలు.  ప్రాయాణికులకు ప్రత్యేకమైన ప్రశాంతతను ఇవ్వడమే వీటి ఉద్దేశమని రైల్వే అధికారులు తెలిపారు. అదేవిధంగా లగేజ్, ఫుట్ వేర్ లు దాచుకోవడానికి సపరేట్ లాకర్ ఏరియాలతో POD హోటల్స్ లో సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. 

1979 నుంచే పాపులర్:

స్లీపింగ్ పాడ్స్ ఇప్పటికే పలు ఆస్పత్రులు, ఎయిర్ పోర్టులు, యూనివర్సిటీలు, ఇతర పబ్లిక్ ప్లేసెస్ లలో అందుబాటులో ఉన్నాయి. ఇందులో 20 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే స్ట్రెస్ తొలగి పోయి, మైండ్ రీఫ్రెష్ అవుతుందట. అంతేకాకుండా ఎనర్జీ పెరగడంతో పాటు ఫోకస్ పెరగడం, లెర్నింగ్ స్కిల్స్ పెరగడం మొదలైన ఉపయోగాలు ఉన్నాయట ఈ స్లీపింగ్ పాడ్స్ తో. అందుకే పర్సనల్ గా కూడా వీటిని వినియోగిస్తుంటారు. ఈ స్లీపింగ్ పాడ్స్ మొదట జపాన్ లో 1979 లో కనుగొన్నారు. క్యాప్సుల్స్ ఇన్ ఒసాక (Capsule Inn Osaka) అనే జపాన్ ప్రాజెక్టులో భాగంగా కిషో కురొకవా వీటిని రూపొందిచారు.