
- జీహెచ్ఎంసీ, ఎయిర్ పోర్ట్లో జాబ్ల పేరిట ఫ్రాడ్
- నిందితుడిపై కేసు
ఎల్బీనగర్, వెలుగు: జాబ్ పేరిట మోసం చేసిన వ్యక్తిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ మీర్పేట్ పోలీసులు తెలిపారు. కూకట్ పల్లికి చెందిన మల్లేశ్2 నెలల క్రితం మీర్ పేట్ లెనిన్ నగర్ లో మీటింగ్ పెట్టాడు. తనను లక్కీ సెక్యూరిటీ, మ్యాన్ పవర్ సంస్థ ఎండీగా పరిచయం చేసుకున్నాడు.
జీహెచ్ఎంసీ, ఎయిర్ పోర్ట్ లో హౌస్కీపింగ్, సూపర్వైజర్ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ స్థానికులు సుమారు 100 మంది వద్ద రూ.2 వేల నుంచి రూ.7 వేల వరకు వసూలు చేశాడు. ఉద్యోగంలో చేరకముందే వారికి ఫేక్ ఐడీ కార్డులు, యూనిఫాంలు అందించాడు. తర్వాత జాబ్ఇవ్వలేదు. ఈ విషయమై అతన్ని అడుగుతుంటే ముఖం చాటేస్తున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.