హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు రోడ్లపైకి వచ్చి.. స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూకట్పల్లి సర్కిల్ ఆల్విన్ కాలనీ, డివిజన్ ధరణినగర్ కాలనీలో వరద నీరు తీవ్రంగా వచ్చి చేరుతుంది. దీంతో రోడ్లు వరద నీటితో మునిగిపోతున్నాయి. ఆ ప్రాంతంలో ఎగువన ఉన్న పరికి చెరువు నుంచి పక్కన ఉన్న ప్రాంతాలకు భారీగా నురగ వస్తోంది. దీంతో ఆ చెరువులో ఉన్న మురికి నీరు అంతా జనవాసంలోకి రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ALSO READ :టీఎస్ఆర్టీసీ రాఖీ కానుక.. బహుమతులు అందజేసినఎండీ సజ్జనార్
నురగ ఎక్కవగా వస్తున్నందున రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వరద నీటితో పాటు.. నురగ ఎక్కువగా చేరుతుందన్నందున స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నురగ అంతా వచ్చి ఇళ్లలోకి వెళుతుందని.. వ్యాధులు వ్యాపించేందుకు ఎక్కువ అవకాశం ఉందని వాపోతున్నారు. ఆ నురగ తాకితే జారడం గానీ స్కిన్ పైన పడితే అలర్జీ లాంటివి వస్తుంటాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే దీనిపై అధికారులు తగిన చర్యలు చేపట్టాలని.. నురగని కంట్రోల్ చేయాలని కోరుతున్నారు.