హైదరాబాద్​ లో వినాయక నిమజ్జనాలు ఎప్పుడు పూర్తవుతాయంటే...

హైదరాబాద్​ లో వినాయక నిమజ్జనాలు ఎప్పుడు పూర్తవుతాయంటే...

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జనాలు  బుధవారం ( సెప్టెంబర్​ 18)కూడా  కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు జరుగుతున్నాయి. నిమజ్జనం కోసం  వేలాది వినాయక విగ్రహాలు వరుసలో బారులు తీరాయి. ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం లోపు నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 

హుస్సేన్ సాగర్ కు భారీగా గణపయ్య విగ్రహాలు తరలి వస్తున్నాయి. ట్యాంక్ బండ్ చుట్టూ  ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. నిమజ్జన కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.  ఇదిలా ఉంటే వాహనదారులు.. ఆఫీసులకు వెళ్లే వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్​ మార్గ్​ లో ఒకవైపు రోడ్​ను క్లియర్​ చేశారు.  ఈ మార్గంలో నిమజ్జనానికి వచ్చే విగ్రహాలరు జలవిహార్​, పీపుల్స్​ ప్లాజా వైపు దారి మళ్లించారు.  ఇంకా దాదాపు 5 వేలకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. 

హుస్సేన్​ సాగర్​ చుట్టూ జీహెచ్​ఎంసీ సిబ్బంది క్లీనింగ్​ చేస్తున్నారు.  అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు హైదరాబాద్​ లో  ( బుధవారం ఉదయం 7 గంటల వరకు) 1 లక్ష 3500 వినాయక విగ్రహాలు నిమజ్జనం జరిగాయి.  అత్యధికంగా అత్యధికంగా మూసాపేట ఐడీఎల్ చెరువులో 26,546 గణనాథుల నిమజ్జనం జరిగింది. ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గం వద్ద 4,730, నెక్లెస్ రోడ్ వద్ద 2,360, పీపుల్స్ ప్లాజా వద్ద 5500 విగ్రహాల నిమజ్జనాలు జరిగాయి. ఇక అల్వాల్ కొత్తచెరువులో 6,221 వినాయక విగ్రహాల నిమజ్జనాలు జరిగాయని అధికారులు తెలిపారు.గ్రేటర్‌ పరిధిలో 35 వేల మందితో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. వర్షం లేకపోవడంతో భక్తులు పెద్ద సంఖ్యలో శోభాయత్రలో పాల్గొన్నారు. ట్యాంక్‌బండ్‌, ఎన్‌టీఆర్‌ మార్గ్‌ పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి.