హైదరాబాద్: జీహెచ్ ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా యంత్రాంగం కొరడా ఝులిపిస్తోంది. చెరువులు, రోడ్లు , వీధులను ఆక్రమించి నిర్మించిన ఇళ్లు, ఇతర నిర్మాణాలను తొలగిస్తున్నారు. శివరాంపల్లి, చందానగర్, హఫీజ్ పేట్ ప్రాంతాల్లో శనివారం ఆగస్టు 10, 2024న తెల్లవారు జామునుంచే అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభించారు. భారీ బందోబస్సు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి.
ఇప్పటివరకు ఈ ప్రాంతాల్లో మొత్తం 50 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. కూల్చివేసిన అక్రమ నిర్మాణాల్లో బహదూర్ పురా ఎమ్మెల్యే ముబిన్ కు సంబంధించిన భవనాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. కూల్చివేతలు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.
చందానగర్ సర్కిల్ హఫీజ్ పేట్ డివిజన్ వైశాలినగర్ లోని ఈర్ల చెరువు బఫర్ జోన్ నిర్మించిన మూడు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. స్థానికులనుంచి వచ్చిన ఫిర్యాదులతో ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా అధికారులు చెబుతున్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శివరాంపల్లి లో 18 ఎకరాల చెరువు లో కబ్జా కు గురైన 5 ఎకరాలలో నిర్మించిన అక్రమ కట్టడాలను కుల్చుతున్న అధికారులను అడ్డుకున్నారు బహదూర్ పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఉదయం నుండి కూల్చివేతలు కొనసాగుతున్నాయి.
కూల్చి వేతల విషయం తెలుసుకున్న బహదూర్ పురా ఎంఎల్ఏ మహమ్మద్ ముబెన్ అక్కడికి చేరుకోవటం అక్కడ ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండ డానికి పోలీసులు ఎంఎల్ఏ నీ అదుపు లోకి తీసుకొని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం లోని కేశం పేట్ పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీస్ అధికారులు.