హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హైదరాబాద్లోని ఈ ఏరియానే..

హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హైదరాబాద్లోని ఈ ఏరియానే..
  • ఓల్డ్​మ్యాప్లు, టెక్నాలజీతో.. చెరువుల హద్దులు నిర్ణయిస్తాం
  • హైడ్రా కమిషనర్ రంగనాథ్

ఇబ్రహీంపట్నం/ మేడిపల్లి/ చాంద్రాయణగుట్ట, వెలుగు: టెక్నాలజీ, ఓల్డ్​మ్యాప్​లు, ట్రోపో షీట్లు వినియోగించి చెరువుల ఎఫ్టీఎల్, హద్దులను నిర్ధారిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్​ తెలిపారు. బుధవారం ఆయన తుర్కయాంజల్ మున్సిపాలిటీ ఇంజాపూర్​లోని మాసబ్ చెరువు, దిలావర్​ఖాన్​ చెరువులను హైడ్రా, స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. పలు కాలనీల అసోసియేషన్ నాయకులు, స్థానికులతో రంగనాథ్​మాట్లాడారు. మున్సిపల్​కమిషనర్ అమరేందర్​రెడ్డి, అబ్దుల్లాపుర్​మెట్​తహసీల్దార్​సుదర్శన్​రెడ్డి ఉన్నారు. అలాగే పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధి కమలానగర్ లో రంగనాథ్ పర్యటించారు. సర్వే నంబర్ 40లో రోడ్డు, పార్క్ కబ్జాకు గురైందని సహజ యోగా సభ్యులు ఫిర్యాదు చేయడంతో బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోడ్డు సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు.

పార్కు స్థలంలో ఇంటి పర్మిషన్ ఎలా ఇచ్చారని పీర్జాదిగూడ టీపీఎస్ సుకన్యను వివరణ కోరారు. బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచెర్ల చింతలచెరువు బఫర్ జోన్ లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కట్టిన అపార్ట్​మెంట్లపై బోడుప్పల్ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ ఫిర్యాదు మేరకు కమిషనర్ రంగనాథ్ బుధవారం పరిశీలించారు. ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని మేయర్ అజయ్ కోరారు. అలాగే గౌలిపురా మేకలమండీలో స్లాటర్ హౌస్ తెరుచుకునేలా తమ వంతు సహకారం చేస్తానని హైడ్రా అధికారి తిరుమలేశ్​తెలిపారు. గౌలిపుర ఆరె కటిక సంఘం ప్రతినిధుల ఫిర్యాదుతో బుధవారం వారు గౌలిపురా కమేలాను సందర్శించారు.