
హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. హైదరాబాద్ కూకట్ పల్లి ఆల్విన్ కాలనీలో ఆక్రమణలను తొలగించింది. ఆల్విన్ కాలనీ సమీపంలోని చెరువును కబ్జా చేసి కట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది.
స్థానికుల ఫిర్యాదుల మేరకు ఆల్విన్ కాలనీ భూదేవి హిల్స్ పరికి చెరువులో ఆక్రమణలను కూల్చేశారు అధికారులు. గత కొంత కాలంగా అక్రమ నిర్మాణాలు యధేచ్చగా సాగుతున్నాయని, గతంలో కట్టిన నిర్మాణాలు కూడా అలాగే ఉన్నాయని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు జేసీబీలతో, పోలీసుల పర్యవేక్షణలో హైడ్రా అధికారులు చెరువు వద్దకు చేరుకున్నారు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లను నిర్ధారించి, అక్రమంగా ఉన్న నిర్మాణాలను కూల్చివేశారు.