హైడ్రాకు 169 మంది సిబ్బంది... వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్​పై నియామకం

హైడ్రాకు 169 మంది సిబ్బంది... వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్​పై నియామకం
  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం 169 మంది సిబ్బందిని కేటాయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రాలో కొత్తగా వివిధ కేటగిరీల్లో డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌పై వారి నియామకం చేపట్టింది. కేడ‌‌‌‌‌‌‌‌ర్ పోస్టుల కింద క‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ర్ (ఐఏఎస్ ర్యాంక్), అడిష‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ల్ క‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌(ఎస్పీ ర్యాంక్) పోస్టుల‌‌‌‌‌‌‌‌ను ఒక్కొక్కటి చొప్పున క్రియేట్ చేశారు. మ‌‌‌‌‌‌‌‌రో మూడు అడిష‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ల్ క‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ర్(ఎస్పీ ర్యాంక్) పోస్టులు, ఐదు డిప్యూటీ సూప‌‌‌‌‌‌‌‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాల‌‌‌‌‌‌‌‌ను క‌‌‌‌‌‌‌‌ల్పించారు. ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాలు 16, స‌‌‌‌‌‌‌‌బ్ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాలు 16 ఉన్నాయి.

రిజర్వ్ ఇన్​స్పెక్టర్​ 3, రిజర్వ్ సబ్​ ఇన్​స్పెక్టర్ 6,  కమ్యూనికేషన్స్​లో ఇన్​స్పెక్టర్​ ఒకటి, సబ్​ ఇన్​స్పెక్టర్​ 2,  పోలీస్​ కానిస్టేబుల్​ 2,  అడిషనల్​ డిస్ట్రిక్ట్​ ఫైర్​ ఆఫీసర్​ ఒకటి, స్టేషన్​ ఫైర్​ ఆఫీసర్​12, అసిస్టెంట్ ఇంజినీర్(పీహెచ్) పోస్టులు 10 ఉన్నాయి. అనలిటికల్​ ఆఫీసర్, డిప్యూటీ అనలిటికల్​ఆఫీసర్​ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున, అసిస్టెంట్​ అనలిటికల్​ ఆఫీసర్​ 2,  రీజినల్​ ఫైర్​ ఆఫీసర్ ఒకరు, సిటీ ప్లానర్​ ఒకరు, డిప్యూటీ సిటీ ప్లానర్ 3, ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్​ (ఇరిగేషన్​) ఒకరు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్ (పీహెచ్)​ 3,ఫైనాన్స్​ నుంచి డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారి ఒకరు, డిప్యూటీ కలెక్టర్​ ఒకరు, తహసీల్దార్లు ముగ్గురు, సర్వేయర్లు ముగ్గురు, ఒక సబ్​ రిజిస్ట్రార్, సూపరింటెండెంట్లు ముగ్గురు, ఫారెస్ట్​ రేంజ్​ ఆఫీసర్ ఒకరు, పీఆర్​ఓ ఒకరు, పీసీబీ సైంటిస్ట్​ ఒకరు డిప్యూటేషన్​పై హైడ్రాలో పనిచేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇంకో  946 మంది ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులను డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌ మీద తీసుకోనున్నారు.