హైదరాబాద్ లోని చెరువులు, నాళాలు అక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో కట్టడాలను నేలమట్టం చేసింది. హైడ్రా కూల్చివేసిన మెటీరియల్ తరలించేందుకు కాంట్రాక్టర్ల నుంచి టెండర్లకు దరఖాస్తులు కోరుతుంది. సెప్టెంబర్ 19 నాటికి GHMC మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 23 చోట్ల 262 బిల్డింగులు హైడ్రా కూల్చివేసింది. వాటికి సంబంధించిన నిర్మాణ వ్యర్థాలు తొలగించేందుకు కాంట్రాక్టర్లను ఇచ్చేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 20 నుంచి 27 వరకు టెండర్లు ఆన్ లైన్ పద్ధతిలో దాఖలు చేసుకోవచ్చు.
ALSO READ : బుల్డోజర్లతో నేలమట్టం : మంచిర్యాల జిల్లాలో 5 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత