
- హైడ్రా చీఫ్ రంగనాథ్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. మ్యాన్ హట్టన్ ప్రాజెక్టుపై చేసిన ఫిర్యాదు అందిందని, దానిపై దర్యాప్తు చేపట్టామని హైడ్రా చీఫ్ రంగనాథ్ స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ వేస్టేజీని ఎఫ్టీఎల్ పరిధిలోని భూముల్లో డంప్ చేస్తున్నట్లు, ఆ భూములను ఆక్రమించినట్లు ఆయన చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అయితే గూగుల్ మ్యాప్ లో మాత్రం ఎఫ్టీఎల్ భూములను ఆక్రమించినట్లు కనిపించడం లేదన్నారు. వంశీరామ్, ఆదిత్య, రాజ్ పుష్ప వంటి బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీలపై కూడా ఫిర్యాదులు వచ్చాయని, ఆ సంస్థలకు నోటీసులు ఇచ్చామని చెప్పారు.