కర్ణాటకలో హైడ్రా కమిషనర్ రంగనాథ్

కర్ణాటకలో హైడ్రా కమిషనర్ రంగనాథ్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువుల పరిరక్షణకు నడుం భిగించింది. కర్ణాటకలో అమలవుతున్న చెరువుల పరిరక్షణ చర్యలను తెలుసుకోవడానికి హైడ్రా కమిషన్ రంగనాథ్ ఆయన టీం అక్కడికి వెళ్లారు. కర్ణాటక ట్యాంక్ కన్సర్వేషన్, KTCDA సీఈఓ రాఘవన్, డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో శుక్రవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం అయ్యారు. చెరువుల పరిరక్షణకు కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

KTCDA యాక్ట్ 2014ను హైడ్రా అధికారుల బృందం పరిశీలించారు. చెరువుల పరిరక్షణలో కర్ణాటక ట్యాంట్ కర్వర్జేషన్ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ (KTCDA) చేపడుతున్న చర్యలపై అధ్యయనం చేశారు. FTL తో పాటు బఫర్ జోన్స్ లో వున్న భూమి మొత్తం ప్రభుత్వ భూమిగా పరిగణిస్తున్నామని KTCDA సీఈఓ రాఘవన్ తెలిపారు. బఫర్ జోన్ ను కర్ణాటకలో మాగ్జిమం వాటర్ లెవెల్ గా పరిగణిస్తారంట. కర్ణాటకలో దిశాంక్ అనే ఆప్ లో ప్రభుత్వ భూమి, పట్టా భూమి ఏదని తెలుసుకోవచ్చట. ఆ ల్యాండ్ ఓనర్ ఎవరనే వివరాలు కూడా తెలుసుకోవచ్చు. హైడ్రా అధికారులు చెరువు ఆక్రమణ నివారించేందుకు KTDCA అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేశారు. చెరువుల అభివృద్ధిలో DPR రూపొందించడం, దానిని టెక్నికల్ టీం అధ్యయనం చేయడం.. తర్వాత పనులను చేపట్టడం వంటి విధానాలను సీఈఓ రాఘవన్ వివరించారు.