ఆక్రమణలు అడ్డుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్ ప్రశ్నార్థకరం : ఏవీ రంగనాథ్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. GHMC పరిధిలో చెరువులు, కుంటల ఆక్రమణలను గుర్తిస్తున్నామన్నారు. చెరువుల ఆక్రమణలు అడ్డుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్ ప్రశ్నార్థకరంగా మారుతుందన్నారు ఏవీ రంగనాథ్. త్వరలో ప్రభుత్వం హైడ్రాకు పెద్ద ఎత్తున సిబ్బందిని నియమిస్తుందని చెప్పారు. ప్రజల నుంచి హైడ్రాకు వందల ఫిర్యాదులు వస్తున్నాయని వివరించారు. 

దశల వారీగా హైడ్రా పనిచేస్తుందని తెలిపారు.  ఫస్ట్ ఫేజ్ లో ఆక్రమణలను అడ్డుకోవడం హైడ్రా చేసే పని చేస్తుందన్నారు.  చెరువుల FTL, బఫర్ జోన్ లో ఎవరు స్థలాలు కొనవద్దని సూచించారు. పార్కు స్థలాలను పరిరక్షించేందుకు ముందుకొచ్చే కాలనీ సంఘాలకు అండగా ఉంటామన్నారు రంగనాథ్. అక్రమంగా అనుమతులు ఇచ్చే అధికారులపై విజిలెన్స్ విచారణ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తామని చెప్పారు.