కబ్జా భూతం.. భక్షుకుంట, రేగులకుంట చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్

మియాపూర్: చందానగర్ పరిధిలోని రేగులకుంట, భక్షుకుంట చెరువులు కబ్జాకు గురయ్యాయన్న ఫిర్యాదుల మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వాటిని పరిశీలించారు. కబ్జాకు గురైన ల్యాండ్ వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భగా స్థానికులు.. ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు వ్యక్తులు ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని  హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. అలా ప్రయివేట్ పరం కాకుండా చూడాలని ఆయన్ని కోరారు. రంగనాథ్ ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారు. స్థలం కబ్జా కాకుండా చూడాలని స్థానిక హైడ్రా అధికారులకు ఆదేశాలిచ్చారు. చెరువులతో పాటు వివిధ కాలనీల్లో పార్కుల కోసం, ఇతర ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలను హైడ్రా కాపాడుతుందని రంగనాథ్ స్పష్టం చేశారు.

ALSO READ | వనస్థలిపురంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన జీహెచ్ఎంసీ

రేగులకుంట చెరువులో నీటి స్వచ్ఛత గురించి హైడ్రా కమిషనర్ స్థానికులతో మాట్లాడారు. చెరువుల్లోకి మురుగు నీరు చేరకుండా మళ్లించిన తీరును ఆయన దగ్గరుండి పరిశీలించారు. తక్కువ ఖర్చుతో రెండు చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.