హైడ్రా ఏర్పాటు చట్టవిరుద్దం అంటూ హైకోర్టులో వేసిన పిటిషన్ పై శనివారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. హైడ్రాకు చట్టబద్దతా ఉందా అని ఇప్పుడు కొంతమంది ప్రశ్నిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై న్యాయస్థానాలకు కూడా వెళ్లారు.. వాటికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేస్తోందని రంగనాథ్ అన్నారు. హైడ్రా దుకుడు ఆపదని.. మరింత వేగంగా ముందుకు వెళ్తామని హైడ్రా కమిషనర్ చెప్పారు.-
ALSO READ | హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం జులై 19న జీవో 99 ద్వారా హైడ్రా ఏర్పాటు చేసింది. రాబోయే రోజుల్లో హైడ్రా మరింత దూకుడుగా ముందుకు వెళ్తోందని రంగనాథ్ అన్నారు. ప్లానింగ్ కమిషన్, క్యాబినెట్ సెక్రటేరియేట్, లా కమిషన్, ఏసీబీ, విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఇలా ఎన్నో అథారిటీలు G.O ల ద్వారానే ఏర్పాటయ్యాయని హైకోర్టు పిటిషనర్ కు బదులిచ్చారు రంగనాథ్. సెప్టెంబర్ నెలలోనే హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. హైడ్రా చట్ట వ్యతిరేక పని చెయ్యడం లేదడం లేదని ఏవీ రంగనాథ్ చెప్పుకొచ్చారు.