ఆ బిల్డింగ్ హైడ్రా కూల్చలేదు : కమిషనర్ రంగనాథ్

ఆ బిల్డింగ్ హైడ్రా కూల్చలేదు : కమిషనర్ రంగనాథ్

సంగారెడ్డి : హైడ్రా కూల్చివేతల్లో హోం గార్డ్ ప్రాణాలు కోల్పోయారని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. మల్కాపూర్ చెరువులో కూల్చివేస్తున్న సమయంలో శిథిలాలు వచ్చి దూరంగా ఉండి వీడియో తీసున్న హాం గార్డ్ తలకు తగిలింది. దీంతో విధి నిర్వహణలో ఉన్న హోం గార్డ్ కు రక్తస్రావమై తీవ్ర గాయాల పాలైయ్యాడు. ఆ కూల్చివేత హైడ్రా ఆధ్వర్యంలోనే జరిగిందని.. దానికి కారణం హైడ్రానే అని సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను ఆదివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఖండించారు. 

ALSO READ | హైడ్రా వ్యర్థాల తొలగింపు, కూల్చివేతలకు టెండర్లు క్లోజ్

మల్కాపూర్  చెరువు కూల్చివేతల్లో గాయపడిన హోం గార్డ్ ఆరోగ్యం కుదుటపడుతోందని ఆయన మీడియాకు తెలిపారు. ఆ కూల్చివేతలకు హైడ్రా చేయలేదని.. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో మాత్రమే హైడ్రా కూల్చివేతలు చేపడుతుందని గుర్తించాలని అన్నారు. రహదారుల విస్తరణ కోసం కూల్చివేతలు జరిగినా, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కూల్చివేతలు జరిగినా హైడ్రా చేసినట్టు ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండిచారు. కొంతమంది హైడ్రాను అప్రతిష్టపాలు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఎవరూ పావులు కావద్దని హైడ్రా కమిషనర్ సూచించారు. వాస్తవాలు తెలుసుకోకుండా.. హైడ్రాపై అసత్య వార్తలు ప్రచారం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ హెచ్చరించారు.