చెరువుల అభివృద్ధికి సహకరించాలి : హైడ్రా క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్ ఏవీ రంగ‌‌‌‌నాథ్

చెరువుల అభివృద్ధికి సహకరించాలి : హైడ్రా క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్ ఏవీ రంగ‌‌‌‌నాథ్
  • సీఎస్ఆర్​ కింద ఫండ్స్​ ఇవ్వండి: హైడ్రా

హైదరాబాద్ సిటీ, వెలుగు: కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ కింద నిధులిచ్చి చెరువుల అభివృద్ధికి సహకరించాలని హైడ్రా క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్ ఏవీ రంగ‌‌‌‌నాథ్ కోరారు. గురువారం నాన‌‌‌‌క్‌‌‌‌రామ్ గూడ‌‌‌‌లోని ఖాజాగూడ పెద్ద చెరువుతోపాటు నెక్నాంపూర్‌‌‌‌లోని ఇబ్రహీంబాగ్ చెరువును ఆయన ప‌‌‌‌రిశీలించారు. ఖాజాగూడ చెరువు అభివృద్ధి చేయడంలో త‌‌‌‌లెత్తిన ఇబ్బందుల‌‌‌‌ను ఎన్ఎస్ఎల్ ఇన్‌‌‌‌ఫ్రా, దివ్యశ్రీ ఇన్‌‌‌‌ఫ్రా ప్రతినిధులు క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్ దృష్టికి తీసుకువ‌‌‌‌చ్చారు.

తర్వాత అధికారుల‌‌‌‌తో మాట్లాడిన కమిషనర్​చెరువులోకి మురుగు చేర‌‌‌‌కుండా కాలువ డైవ‌‌‌‌ర్షన్ ప‌‌‌‌నులు చేప‌‌‌‌ట్టాల‌‌‌‌ని సూచించారు. టూరిజం డెవలప్ మెంట్ సంస్థ  కూడా చెరువు బ్యూటిఫికేషన్​లో భాగ‌‌‌‌స్వామ్యం కావాల‌‌‌‌ని ఆ సంస్థ ఏజీఎం వ‌‌‌‌ర‌‌‌‌ప్రసాద్‌‌‌‌కు సూచించారు. నెక్నాంపూర్​లోని ఇబ్రహీంబాగ్ చెరువు ప‌‌‌‌నులు వేగవంతం చేయాలన్నారు. ఇబ్రహీంబాగ్ చెరువులోకి మురుగు చేర‌‌‌‌కుండా నాలాల‌‌‌‌ను డైవ‌‌‌‌ర్ట్ చేయాల‌‌‌‌ని ఇరిగేష‌‌‌‌న్ అధికారుల‌‌‌‌ను కోరారు.